‘నాకు నచ్చని వాడితో నువ్వు మాట్లాడావు. అందుకే నీతో నా దోస్తీ కట్’.. ఇలాంటి మాటలు మీరు చిన్నప్పుడు అనే ఉంటారు. లేదంటే ఎవరైనా అంటే వినే ఉంటారు. ఇప్పుడెందుకు వచ్చింది ఈ మాట అనుకుంటున్నారా? ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో సులభంగా అర్థమవ్వాలంటే.. ఈ మాట గుర్తు చేసుకోవాలి అనిపించింది. అసలే హిట్లు లేక సతమతమవుతున్న బాలీవుడ్‌కి ఇప్పుడు ‘బాయ్‌కాట్’ అనే పదం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో బాలీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. Boycott Laal Singh Chaddha అనే మాట, చర్చ కనిపిస్తోంది. మీరు కూడా చూసే ఉంటారు. ఆ సినిమా ఎలా ఉందో కూడా తెలుసుకోకుండా కొంతమంది ఓ గ్రూపుగా చేరి మరీ ఆ సినిమాను, ఆ సినిమా చేసిన హీరో ఆమిర్ ఖాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం దేశ పరిస్థితులపై ఆమిర్ చేసిన ట్వీట్ ఈ బాయ్‌కాట్ ట్రెండింగ్‌కి కారణం. ఆయనెందుకు అన్నారు, దాని వెనుక కారణాలేంటి అనేది పక్కన పెడితే.. ఆ కోపాన్ని ఇప్పటికీ తీర్చుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు.
ఆమిర్ అన్న మాటలు నచ్చక ఆయన సినిమాల మీద బాయ్‌కాట్ దండం ప్రయోగిస్తున్నారు అంటే ఓకే. ఆయన సినిమాలో చిన్న పాత్రలో నటించిన షారుఖ్ ఖాన్‌కు, ఆ సినిమా బాగుందన్న హృతిక్ రోషన్‌కి కూడా ఇప్పుడు బాయ్ కాట్ మంత్రం వాడదామని ఓ నెటిజన్ల గ్రూపు సిద్ధమైంది. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, హృతిక్ ‘విక్రమ్ వేద’ సినిమాలను బాయ్ కాట్ చేయాలని అప్పుడే కొందరు పిలుపునిచ్చారు. దీంతో బాలీవుడ్‌లో రాబోయే రెండు భారీ సినిమాలకు పెద్ద గండమే పొంచి ఉంది. అన్నట్లు ఈ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ రాబోయే సినిమా ‘కబీ ఈద్ కబీ దివాళీ’ని కూడా కొందరు కలిపేశారు.
ఒకవేళ ఈ బాయ్‌కాట్ ఉద్యమం ఇలా కొనసాగితే.. రాబోయే రోజుల్లో బాలీవుడ్‌లో సినిమాలు చేయాలంటే స్టార్ హీరోలు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. పోనీ ఇలాంటి కామెంట్లు చేయకుండా, దేశం కోసం నిష్ఠగా సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్‌కి ఏమన్నా హిట్లు ఇస్తున్నారా? ఆ కొంతమంది అంటే.. లేదనే చెప్పాలి. అక్షయ్ నుండి ఇటీవల వచ్చిన ‘సమ్రాట్ పృథ్వీరాజ్’, ‘రక్షా బంధన్’ దారుణమైన పరాజయం పాలయ్యాయి. కాబట్టి అలా ఇతరుల సినిమాలకు విజయాలు అందివ్వకుండా, మిగిలిన సినిమాల్ని బాయ్‌కాట్ చేసి బాలీవుడ్‌ని ఏం చేద్దాం అనుకుంటున్నారో?
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?