మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ‘కన్నప్ప’ (Kannappa) రూపొందింది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ (Prabhas) కామియో హెల్ప్ అవ్వడంతో మంచు విష్ణు కెరీర్లో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. వీక్ డేస్ లో మళ్ళీ తగ్గినప్పటికీ మొదటి వారం డీసెంట్ వసూళ్లు లభించాయి. నిన్న రిలీజ్ అయిన ‘తమ్ముడు’ (Thammudu) కూడా ఫ్లాప్ అవ్వడం ‘కన్నప్ప’ కి కలిసొచ్చినట్టు అయ్యింది.
మరో 2 రోజులు ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి ‘కన్నప్ప’ (Kannappa) 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 6.80 cr |
సీడెడ్ | 2.26 cr |
ఉత్తరాంధ్ర | 2.16 cr |
ఈస్ట్ | 1.17 cr |
వెస్ట్ | 0.85 cr |
గుంటూరు | 0.93 cr |
కృష్ణా | 0.82 cr |
నెల్లూరు | 0.76 cr |
ఏపీ+తెలంగాణ | 15.75 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.40 cr |
ఓవర్సీస్ | 2.53 cr |
వరల్డ్ టోటల్ | 22.68 cr (షేర్) |
‘కన్నప్ప’ (Kannappa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.87 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లో ఈ సినిమా రూ.22.68 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.41.1 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.64.32 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ వీకెండ్ కొంచెం మెరుపులు మెరిపించే అవకాశం ఉంది.