సినిమాకు భాషా భేదం లేదంటారు… అలా అని సినిమా కథకు, సినిమా కాన్సెప్ట్‌లకు లేదా అంటే కచ్చితంగా ఉంది అనే చెప్పాలి. అందుకే ఒక లాంగ్వేజ్‌లో హిట్ అయిన ప్రతి సినిమా దేశం మొత్తం ఆడాలని లేదు. అలాగే మనకు నప్పే, మనం నమ్మే కాన్సెప్ట్ అందరూ చూస్తారని కాదు. గతంలో చాలా సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. అయితే తాజాగా టాలీవుడ్‌లో ‘అఖండ’ విజయం సాధించిన సినిమా బాలీవుడ్‌కి వెళ్తోంది అని పుకార్లు మొదలయ్యాయి.
టాలీవుడ్‌లో అనే కాదు ఏ భాషలో అయినా ఓ సినిమా హిట్ అయితే… దాని గురించి రీమేక్ పుకార్లు రావడం సహజం. అయితే ఆ సినిమా అక్కడకు తీసుకెళ్తే చూస్తారా లేదా అనేది ఆలోచించుకోవాలి. అలా అని ఆ సినిమాకు అంత సత్తా లేదు అని చెప్పలేం. ‘అఖండ’ గురించే తీసుకుంటే… బాలయ్య అభిమానులు, ఫక్తు మాస్ అభిమానులకు ఈ సినిమా విందు భోజనం అని చెప్పొచ్చు. సినిమాలోని ఎలివేషన్లు, ఎమోషన్లు, ఫైట్లు అద్భుతం. ఈ క్రమంలో మానవ మాతృనికి సాధ్యం కాని కొన్ని ఫీట్లు సినిమాలో చూశాం.
ఇలాంటి మాస్ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారా అంటే కష్టమే అనే చెప్పాలి. గతంలో కొన్ని సినిమాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అంతెందుకు ఇటీవల కాలంలో ఓవర్ ఎలివేషన్లు, మాస్ సీన్లు ఉన్నాయంటూ ‘సత్యమేవ జయతే 2’, ‘అంతిమ్’ను ప్రేక్షకులు తిరస్కరించిన విషయం తెలసిందే. ఇలాంటి సమయంలో మన మాస్ సినిమా అక్కడి ప్రేక్షకులకు నచ్చుతుందా అంటే ఏమో మరి. అన్నట్లు బాలకృష్ణ అక్కడ వెండితెరపై విశ్వరూపం చూపించే హీరోను వెతకడమూ కష్టమే. చూద్దాం అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమా వెళ్తుందేమో.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!