Jr NTR: ఎన్టీఆర్ లుక్స్ అండ్ డైలాగ్స్ కు నార్త్ ఇండియన్స్ ఫిదా..!

  • December 10, 2021 / 07:35 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ నిన్న విడుదలై చరిత్ర సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు, చరణ్ అభిమానులు,రాజమౌళి అభిమానులు.. ట్రైలర్ ఎలా ఉండాలి అనుకున్నారో అలాగే ఉంది. అంతకు మించే ఉందని చెప్పినా అందులో అతిశయోక్తి లేదు. 3నిమిషాల నిడివి గల ట్రైలరే ఈ రేంజ్లో ఉందంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు అంచనాలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మన ఆర్.ఆర్.ఆర్ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు..

అయితే నార్త్ ఆడియెన్స్ ఫోకస్ మన ఆర్.ఆర్.ఆర్ పై ఎక్కువగా ఉందని ప్రత్యేకించి చెప్పాలి. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ ను చూసిన నార్త్ సోదరులు … ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పై వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారు. పులితో ఛేజింగ్ సీన్ లో అతను పలికించిన హావభావాలు, హిందీలో అతను డబ్బింగ్ చెప్పిన విధానం.. వాళ్ళను బాగా ఇంప్రెస్ చేసాయి. ఎన్టీఆర్ ఒక నార్త్ ఇండియన్ లానే డైలాగ్స్ చెప్పాడని..

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కూడా బాలీవుడ్లో స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయని… వారు అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చూస్తుంటే ఎన్టీఆర్.. బాలీవుడ్లో మంచి క్రేజ్ ను సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. అటు తర్వాత తర్వాతి సినిమాలతో ఆ క్రేజ్ ను సంపాదించుకుంటాడా లేదా అన్నది చూడాలి..!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus