Prabhas: పౌజీ కోసం మరో కాస్ట్లీ యువరాణి!

ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పౌజీ సినిమా గురించి రోజుకో ఆసక్తికరమైన అంశం లీక్ అవుతోంది. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే మంచి హైప్ ఉంది. ముఖ్యంగా లవ్ అండ్ వార్ కాన్సెప్ట్‌తో వస్తుండటంతో, హను మార్క్ ఎమోషన్, విజువల్ గ్రాండియర్ చూపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చేలా మరో టాప్ హీరోయిన్ జాయిన్ అయినట్టు టాక్ వినిపిస్తోంది.

Prabhas

తాజా సమాచారం ప్రకారం, పౌజీలో బాలీవుడ్ స్టార్ అలియా భట్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందట. అయితే, ఆమె పాత్ర కేవలం గెస్ట్ రోల్ అయినప్పటికీ, స్టోరీలో కీలకమైన భాగమని తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అలియా యువరాణిగా కనిపించనున్నారని, ఆమె పాత్ర ప్రిన్స్ లవ్ స్టోరీకి పర్‌ఫెక్ట్ కాంప్లిమెంట్ అయ్యేలా ఉంటుందని టాక్. ఇప్పటికే RRR సినిమాలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అలియా భట్, ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో కనిపిస్తే, పౌజీ క్రేజ్ మళ్లీ పెరుగుతుందనడంలో సందేహమే లేదు.

ఇందులో హీరోయిన్‌గా నూతన నటి అమ్మాన్వీ నటిస్తోంది. ఆమె తొలి సినిమానే పాన్ ఇండియా రేంజ్‌లో రావడం విశేషం. అయితే, అలియా (Alia Bhatt) ఎంట్రీతో నార్త్ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు సౌత్ సినిమాలకు భారీగా షిఫ్ట్ అవుతున్నారు. కియారా అద్వానీ (Kiara Advani), జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  ఇప్పటికే సౌత్‌లో ఫుల్ బిజీగా ఉండగా, ఇప్పుడు అలియా కూడా మరో తెలుగు సినిమా చేయడం గమనార్హం.

ప్రస్తుతం అలియా ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అయితే, పౌజీలో ఆమె ప్రత్యేక పాత్ర కావడంతో, నిర్మాణ సంస్థ ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసిందనే టాక్ ఉంది. బాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోయే ఈ క్రేజీ సినిమా విడుదలయ్యే సమయానికి మరింత భారీ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం పౌజీ షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది.

ఎన్టీఆర్ తో సినిమా.. ఆ తమిళ దర్శకుడికి సాలిడ్ రెమ్యునరేషన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus