చిరు సినిమాకి ఓకే చెబుతుందా..?

సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ఎంత కష్టమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే హీరోయిన్లను రిపీట్ చేస్తున్నారు. లేదంటే ఇతర రాష్ట్రాల నుండి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు కూడా ఈ బాధలు తప్పడం లేదు. ‘ఖైదీ నెం.150’ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ ను ‘ఆచార్య’లో కూడా రిపీట్ చేస్తున్నారు. చిరు తదుపరి సినిమాలకు కూడా ఇప్పటినుండే హీరోయిన్లను వెతికి పెట్టుకుంటున్నారు. మోహన్ రాజ్ డైరెక్ట్ చేయనున్న ‘లూసిఫర్’ రీమేక్ లో హీరోయిన్ లేదని తెలుస్తోంది.

ఈ సినిమా తరువాత బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు మెగాస్టార్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలానే హీరోయిన్ కోసం అన్వేషణ కూడా మొదలుపెట్టారు. ఈసారి చిరు కోసం బాలీవుడ్ నుండి హీరోయిన్ ని తీసుకురాబోతున్నారు. ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లను కన్సిడర్ చేస్తున్నప్పటికీ.. ఈ లిస్ట్ లో సోనాక్షి సిన్హా పేరు బలంగా వినిపిస్తోంది.

చిరు కూడా సోనాక్షి అయితే ఓకే అని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బాబీ ఈ విషయంలో సోనాక్షితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సోనాక్షి.. రజినీకాంత్ లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించింది. బాబీ చెప్పే కథ గనుక నచ్చితే ఆమె మెగాస్టార్ కి కాల్షీట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ‘ఆచార్య’, ‘లూసిఫర్’ సినిమాలు పూర్తయిన తరువాత బాబీ దర్శకత్వంలో సినిమా మొదలవుతుంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus