Pushpa2: పుష్ప ది రూల్ లో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. రికార్డులు బ్రేక్ అవుతాయా?

ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్న పుష్ప2 సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో కొత్త పాత్రలు ఉండబోతున్నాయనే సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పుష్ప ది రూల్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ ఎప్పుడు విడుదలైనా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రైజ్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. పుష్ప ది రూల్ అంతకు మించి కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పుష్ప ది రూల్ (Pushpa2) సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండనుందని ఊర్వశి రౌతేలా ఈ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప ది రైజ్ బాలీవుడ్ లో అంచనాలను మించి సక్సెస్ సాధించింది. పుష్ప ది రూల్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయని భోగట్టా.

బన్నీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని నంబర్ వన్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బన్నీ క్రేజ్ రెట్టింపు కావడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus