బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌తో (Ram Charan) కలిసి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ తర్వాత పూర్తిగా RC16 (RC 16 Movie) షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్, మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే RC16తో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న చరణ్, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ బాలీవుడ్ నిర్మాత మరెవరో కాదు, కరణ్ జోహార్ అని తెలుస్తోంది.
కరణ్ జోహార్ గతంలో తెలుగు సినిమాలతో అనేక అనుబంధాలు కొనసాగించినా, పూర్తి స్థాయిలో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా ఒక టాలెంటెడ్ దర్శకుడితో చరణ్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడట. బాలీవుడ్, టాలీవుడ్ మార్కెట్‌ను కలిపేలా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి కొంతకాలం క్రితం విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) కరణ్ జోహార్ (Karan Johar) ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది.
కానీ అది ముందుకు సాగలేదు. ఇప్పుడు చరణ్ తో డీల్ ఫైనల్ అయినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు, కరణ్ జోహార్ తెలుగు పరిశ్రమలో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. RRR తర్వాత అక్కడ భారీ ఫ్యాన్‌బేస్ ను సంపాదించుకున్న చరణ్ తో కరణ్ జోహార్ సినిమా అంటే హైప్ క్రియేట్ కావడం ఖాయం.
ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ కాంబో నిజమే అయితే, రామ్ చరణ్ కెరీర్‌లో మరో కీలక మలుపు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ రూమర్లు నిజమేనా? కరణ్ తెలుగు పరిశ్రమలో మిడ్ రేంజ్ సినిమాలను కూడా నిర్మించబోతున్నాడా? అన్న దానిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.