అక్షయ్ కుమార్ నుండి ఆలియా భట్ వరకు గెస్ట్ అప్పీరియన్స్‌ కోసం ఎవరెన్ని కోట్లు తీసుకున్నారంటే..?

ఈమధ్య బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ‘లైగర్’ దెబ్బకి అవకాశాలు రాకపోవడంతో తన పారితోషికాన్ని దాదాపు రూ. 40 లక్షల వరకు తగ్గించిందని, లేదు 40 ఇస్తే చాలు అందని వార్తలు వైరల్ అయ్యాయి.. హిట్, ఫ్లాప్ ఏదైతే మాకేంటి సంబంధం అంటూ ఫుల్ లెంగ్త్ రోల్ అయినా, కామియో క్యారెక్టర్ అయినా కోట్లాది రూపాయలు డిమాండ్ చేసే యాక్టర్స్ కూడా ఉన్నారు హిందీ ఇండస్ట్రీలో..

తెలుగులో మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, తమిళనాట రజినీ కాంత్, విజయ్, అజిత్ బాగానే తీసుకుంటారు కానీ ఈ బాలీవుడ్ బ్యాచ్ మాత్రం ‘పైసల్ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్’ అంటారు.. అందుకే నిమిషాల పాటు కనిపించాలన్నా కానీ నిర్మాతలు కోట్లు కురిపించాల్సిందే.. ఇప్పుడు గెస్ట్ అప్పీరియన్స్ కోసం సల్మాన్ ఖాన్ నుండి ఆలియా భట్ వరకు ఎవరెంత తీసుకున్నారు.. తీసుకుంటున్నారు.. అనే వివరాలు అక్కడి మీడియా వెల్లడించింది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. సల్మాన్ ఖాన్..

సల్లూ భాయ్ ‘ట్యూబ్ లైట్’ మూవీలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర చేసినట్టుగానే.. ఇప్పుడు షారుఖ్ ‘పఠాన్’ లో సల్మాన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడు.. ఫ్రెండ్ కోసం భాయ్ జాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు..

2. అజయ్ దేవ్‌గన్..

స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అజయ్ దేవ్‌గన్.. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ లో రహీమ్ లాలా క్యారెక్టర్ కోసం రూ. 11 కోట్లు.. అలాగే పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ కోసం రూ. 35 కోట్లు తీసుకున్నారట..

3. హ్యూమా ఖురేషి..

‘గంగూబాయి కతియావాడి’ లో దిల్ రుబా అనే కవాలి సింగర్‌గా ప్రత్యేకపాత్రలో కనిపించడానికి హ్యూమా రూ. 2 కోట్లు ఛార్జ్ చేశారు..

4. అక్షయ్ కుమార్..

బాలీవుడ్ ఖిలాడి రెమ్యునరేషన్ భారీగానే ఉంటుందనే సంగతి తెలిసిందే.. ధనుష్, సారా అలీ ఖాన్ నటించిన ‘అత్రాంగి రే’ లో ఇంపార్టెంట్ రోల్ చేసినందుకు రూ. 27 కోట్లు తీసుకున్నారట..

5. ఆలియా భట్..

పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్ చరణ్ జోడీ సీతగా కనిపించడానికి.. అది కూడా కేవలం 15 నిమిషాల పాత్ర కోసం ఆలియా అక్షరాలా రూ. 9 కోట్లు అందుకున్నారు..

6. షారుఖ్ ఖాన్..

వెర్సటైల్ యాక్టర్ ఆర్.మాధవన్ ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’ మూవీతో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు.. తమిళ్ వెర్షన్‌లో జర్నలిస్టుగా కోలీవుడ్ స్టార్ సూర్య కనిపిస్తే.. హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్‌లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించారు.. దీనికోసం ఆయన ఎలాంటి పారితోషికమూ తీసుకోలేదు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus