అమితాబ్ హిట్ మూవీ సౌత్ లోకి.. బిగ్ బి పాత్ర‌లో స్టార్ హీరో

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చ‌న్ న‌టించిన పింక్ సినిమా గుర్తుందా.. ఒక హ‌త్య కేసులో ఇరుక్కున్న ముగ్గురు మ‌హిళ‌ల‌ను ఆ గండం నుంచి కాపాడే లాయ‌ర్ పాత్ర‌లో అమితాబ్ న‌ట‌న విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక్క‌డి సినిమాలు అక్క‌డ‌.. అక్క‌డి సినిమాలు ఇక్క‌డ రీమేక్ చేసే ట్రెండ్ ఇటీవ‌లి కాలంలో బాగా ఎక్కువైంది. దీంతో పింక్ సినిమా పైన సౌత్ జ‌నాల క‌ళ్లు ప‌డ్డాయి. ద‌క్షిణాదికి చెందిన ఒక బ‌డా నిర్మాత ఆ సినిమాను మ‌న జ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా మార్పులు చేర్పులు చేసి రీమేక్ గా దించాల‌ని నిర్ణ‌యించాడు.

ఈ విష‌యాన్ని ఒక అగ్ర ద‌ర్శ‌కుడి వ‌ద్ద చ‌ర్చించ‌గా ఆయ‌న కూడా అందుకు సుముఖత వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.అంతా బాగానే ఉంది కానీ మ‌రీ అమితాబ్ రేంజ్ లో అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ యాక్టింగ్ చేయ‌గ‌ల హీరో ఎవ‌రా అని ఆలోచించ‌గా… త‌మిళ స్టార్ హీరో అజిత్ వారి దృష్టిలో ప‌డ్డాడు. అన్ని అనుకున్న‌ట్టుగా జ‌రిగితే సంక్రాంతి త‌ర్వాత ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. అన్న‌ట్లు అజిత్ కు జ‌త‌గా బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యాబాల‌న్ న‌టించే అవకాశాలున్నట్లు కోలీవుడ్ టాక్. మరోవైపు హిందీ పింక్ వ‌ర్ష‌న్ లో అమితాబ్ కు స‌పోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన తాప్సీ, కీర్తి కొల్హారి పాత్ర‌ల కోసం కూడా ఇక్క‌డ పేరున్న అమ్మాయిల‌ను తీసుకుంటార‌ని స‌మాచారం. త‌మిళ్ తో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంలోనూ ఈ చిత్రాన్ని డ‌బ్ చేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus