మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘బొంబాయ్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఒకప్పటి అందాల తార మనీషా కొయిరాలా అందరికి సుపరిచితమే. ఈ భామ అప్పట్లో కుర్రకారు హృదయాల్లో ఫేవరేట్ హీరోయిన్. వాస్తవానికి తాను నేపాల్ దేశానికి చెందినది అయినా కూడా భారతీయ చలన చిత్రాలలో చాలా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన బొంబాయ్ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్.
మనీషా కొయిరాలా తెలుగు లో కూడా అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించారు. కమల్ హాసన్ సరసన ‘భారతీయుడు’, రజినీకాంత్ తో ‘బాబా’, అర్జున్ తో ‘ఒకే ఒక్కడు’, నాగార్జున తో ‘క్రిమినల్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు ఆమె. ఒకే ఒక్కడు సినిమాలో నెల్లూరి నెరజాణ అనే పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. నాగార్జున తో చేసిన క్రిమినల్ మూవీలోని తెలుసా మనసా సాంగ్ ఇప్పటికి బెస్ట్ మెలోడీ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుంది.

2012 లో ఊహించని విధంగా తన ఆరోగ్యం పాడవటం అది చివరికి అండాశయ కాన్సర్ అని తేలటంతో సినిమాలకు దూరం అయ్యారు మనీషా కొయిరాలా. 3 ఏళ్ళ పాటు కాన్సర్ తో పోరాడి చివరికి 2015లో ఆ భయంకరమైన పరిస్థితుల నుండి బయటపడ్డారు. ఆ తరువాత ఆమె బయట ఎక్కడ మీడియాకి పెద్దగా కనిపించింది లేదు.

రీసెంట్ గా ముంబైలో మీడియా కంట పడ్డారు మనీషా కొయిరాలా. వెంటనే ఫొటోస్ క్లిక్ మనిపించారు అక్కడ ఉన్న మీడియా వారు , ఇప్పుడు ఆ ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అవుతుండగా అది చుసిన వారంతా మనీషా కొయిరాలా ఇలా అయ్యారేంటి అని అనుకుంటున్నారట.
