బన్నీ కోసం ఎదురు చూస్తే చివరికి ఈ హీరో దొరికాడు..?

అల్లుఅర్జున్ తో సినిమా చేయాలనీ ‘గీత ఆర్ట్స్’ ఆఫీస్ కి వచ్చి అక్కడ లాక్ అయిపోయిన దర్శకులు ఎంతో మంది ఉన్నారంట. సంవత్సరాలు తరబడి ఇక్కడే ఉండిపోయిన దర్శకులలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఒకడు. అప్పుడెప్పుడో హీరో రామ్ తో ‘ఒంగోలు గిత్త’ అనే చిత్రం చేసిన తరువాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ ఇక్కడే ఎదురుచూస్తున్నాడట.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ త్రివిక్రంతో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది పూర్తయ్యాక మళ్ళీ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తాడనే వార్త నడుస్తుంది. ఇక దీంతో అల్లు అర్జున్ కోసం ఎదురు చూసే ఓపిక లేకపోవడంతో అఖిల్ తో.. అదే ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం అఖిల్ తర్వాతి చిత్రం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తో చేయనున్నాడట, ఈ మేరకు కథ కూడా ఫైనల్ అయ్యిందట. అక్కినేని వారసుడు గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూడు చిత్రాలు చేసినప్పటికీ ఒక్క హిట్ కూడా దక్కలేదు అఖిల్ కి..! దీంతో ఇటీవల అల్లు అరవింద్ నాగార్జున, అఖిల్ తో ఓ సినిమా చేసి హిట్టిస్తానని నాగ్ కి హామీ ఇచ్చాడంట…! దీంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయినట్టే అని తెలుస్తుంది. ఇలా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ముందు అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకుంటే ఇప్పుడు అఖిల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ చిత్రంతో అయినా భాస్కర్, అఖిల్ లు మంచి హిట్టు కొడతారేమో చూడాలి…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus