Bommarillu Bhaskar, Vaishnav Tej: వైష్ణవ్ భాస్కర్ కాంబోలో మూవీ రానుందా?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో సక్సెస్ చేరింది. బొమ్మరిల్లు భాస్కర్ తర్వాత సినిమా కూడా ఫిక్సైందని వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన వైష్ణవ్ తేజ్ తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు మంచి పేరును సంపాదించుకున్నారు. ఉప్పెన భారీగా కలెక్షన్లు సాధించడంతో ఇతర హీరోల సినిమాల కలెక్షన్ల రికార్డులు బ్రేక్ అయ్యాయి. కొండపొలం సినిమాతో వైష్ణవ్ భాస్కర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాల్సి ఉంది. వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం గిరీశయ్య డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

వైష్ణవ్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పటికే మెగా హీరోలైన రామ్ చరణ్ తో ఆరెంజ్, అల్లు అర్జున్ తో పరుగు సినిమాలను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలలో పరుగు హిట్ గా నిలిస్తే ఆరెంజ్ ఫ్లాప్ గా నిలిచింది. వైష్ణవ్ తో భాస్కర్ లవ్ స్టోరీని తెరకెక్కించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus