శ్రీదేవి కూతురి ఎంట్రీపై తాజా ఖబర్‌!

హెడ్డింగ్‌ చూసి.. అదేంటి శ్రీదేవి కూతురు ఇప్పటికే హీరోయిన్‌ కదా. మొన్నీ మధ్య ‘గుంజన్‌ సక్సేనా’ అనే సినిమాలో అదరగొట్టింది అనుకుంటున్నారా? అయితే మేం చెబుతున్నది మొదటి అమ్మాయి జాన్వి కపూర్‌ గురించి కాదు… రెండో అమ్మాయి ఖుషీ కపూర్‌ గురించి. చాలా రోజుల నుంచి ఖుషీ సినిమా ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నా, ఎక్కడా స్పష్టత లేకుండా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఖుషీ తండ్రి బోనీ కపూర్‌ కాస్త క్లారిటీ ఇచ్చాడు. దాని ప్రకారం చూస్తే ఆ సినిమాను ఆయన నిర్మించడట. ఎందుకంటే?

తల్లి శ్రీదేవికి తగ్గ వారసురాలిగా ఇప్పటికే జాన్వి కపూర్‌ బాలీవుడ్‌లో అదరగొడుతోంది. మరోవైపు ఆమె టాలీవుడ్‌లోకి వస్తుందని వార్తలొచ్చినా, ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమా, ఆ సినిమా అంటూ పుకార్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఈలోగా అతిలోక సుందరి రెండో కూతురు ఖుషి ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారు. చిన్న కూతురు, అందులోనూ ముద్దుల కూతురు కదా… మరోవైపు బోనీ ఈ మధ్య నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనే ఇంట్రడ్యూస్‌ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ బోనీ అందుకు రెడీగా లేరట.

“ఖుషీ కపూర్‌ని చిత్రసీమకు పరిచయం చేయడానికి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. అయితే ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేసేది నేను కాదు. నిర్మాతగా నాకు, నటిగా ఖుషీకి అదంత మంచిది కాదు. ఎంత ఫ్యామిలీ సపోర్టు ఉన్నా, ఇతర నాయికల్లాగే మా అమ్మాయీ సొంతంగా రాణించాలి. అందుకే నేను ఆమెను తొలిసారిగా వెండితెరకు పరిచయం చేయాలని అనుకోవడం లేదు” అంటూ ఇటీవల బోనీ కపూర్‌ చెప్పుకొచ్చారు. ఖుషీ లండన్‌ ఫిలిం స్కూల్లో నటన కోసం శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus