చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్ లకు పెద్ద పీట వేస్తుంటారు మేకర్స్..! కేవలం వాళ్ళు మాత్రమే కాదు.. అభిమానులకు కూడా అలాంటి సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు. అయితే ‘సినిమా కథలో బలముండాలి కానీ.. సెంటిమెంట్లతో పనేముంది’ అని వాదించేవారు కూడా లేకపోలేదు. అయితే యాధృశ్చికంగా కొన్ని సెంటిమెంట్లు రిపీట్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి సెంటిమెంట్ ఒకదాని గురించి మాట్లాడుకుందాం..! అది మన స్టార్లను ఎలా దెబ్బ తీసిందో కూడా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.. ‘బాస్’ అనే పదం చాలా పవర్ ఫుల్. అన్ని పరిశ్రమలలోనూ దీనికి చాలా విలువ ఉంటుంది.
పది మందిని శాసించే పదం అది…! బహుశా బాక్సాఫీస్ ను కూడా అదే విధంగా శాసిస్తుంది అనుకున్నారేమో.. మన దర్శకనిర్మాతలు..! దానిని నమ్మి మూడుసార్లు కింద పడ్డారు.మొదటగా విజయశాంతి ప్రధాన పాత్రలో ‘లేడీ బాస్’ అనే చిత్రం విడుదలయ్యింది. కోడిరామ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది అని అప్పట్లో అంతా అనుకున్నారు.అంతకు ముందు వీరి కాంబినేషన్లో ‘శత్రువు’ ‘పోలీస్ లాక్ అప్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. కానీ ‘లేడీ బాస్’ మాత్రం నిరాశపరిచింది. ఇక అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘బిగ్ బాస్’ చిత్రం విడుదలయ్యింది.
మామూలుగానే మెగాస్టార్ ను అంతా బాస్ అంటుంటారు. పైగా ‘గ్యాంగ్ లీడర్’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన విజయ్ బాపినీడు దర్శకుడు. మరి ఆ సినిమా పై ఎలాంటి అంచనాలు నెలకొంటాయి. కానీ సీన్ ఫుల్ రివర్స్ అయ్యింది. ‘బిగ్ బాస్’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక నాగార్జున కూడా ‘బాస్’ అనే చిత్రం చేసాడు. అతనికి ‘నేనున్నాను’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన వి.ఎన్. ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ఇది. రిలీజ్ కు ముందు ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ ‘బాస్’ ప్రేక్షకులనే కాదు ఫ్యాన్స్ ను కూడా మెప్పించలేకపోయాడు. మరి ముందు ముందు ఈ టైటిల్ తో ఎవరైనా హిట్టు కొడతారేమో చూడాలి.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!