Mahesh, Pawan: పవన్ కళ్యాణ్ వర్సెస్ త్రివిక్రమ్.. 2024లో జరగబోయేది ఇదేనా?

ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. 2024 సంక్రాంతి రేసు నుంచి ప్రాజెక్ట్ కే సినిమా తప్పుకోవడంతో సంక్రాంతి రేసులో చేరే సినిమాల సంఖ్య పెరుగుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారని ఇప్పటికే ప్రకటన వెలువడింది. అయితే సంక్రాంతి రేసులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేరనుందని తెలుస్తోంది.

పవన కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో గబ్బర్ సింగ్ ఒకటిగా నిలవగా పవన్ హరీష్ కాంబినేషన్ లో దాదాపుగా పదేళ్ల తర్వాత ఇదే కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తేరి రీమేక్ అయినప్పటికీ బేసిక్ లైన్ మాత్రమే ఆ సినిమా నుంచి తీసుకున్నారని తెలుస్తోంది. బ్రో సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో 2024 ఎన్నికల ముందు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ సరైన ప్రాజెక్ట్ అని పవన్ ఫీలవుతున్నారు.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 60 రోజుల డేట్లు కేటాయించారని సమాచారం అందుతోంది. 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్ కాగా 2024 సంక్రాంతికి త్రివిక్రమ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ పోటీ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలలో శ్రీలీల హీరోయిన్ కావడం గమనార్హం. ఒకే సమయంలో రెండు సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనడం శ్రీలీలకు సైతం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏ సినిమాకు అద్భుతమైన టాక్ వస్తే ఆ సినిమానే విజేతగా నిలవనుందని తెలుస్తోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus