Kalki, Pushpa: ఆగస్టు వార్‌కి రెండు సినిమాలు రెడీనా… ఫైనల్‌గా ఏది నిలుస్తుందో?

మే 9న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా వస్తుందా? అంటే మొన్నీ మధ్య వరకు అవును / కాదు అనేవి సమాధానాలుగా వచ్చేవి. అయితే ఇప్పుడు దేశంలో ఎన్నికల ఫీవర్‌ మొదలవుతున్న నేపథ్యంలో ఆ డేట్‌కి సినిమా రావడం కష్టం అని తేలిపోయింది. అయితే టీమ్‌ నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఎప్పుడు చెబుతారో తెలియదు కానీ.. సినిమా రిలీజ్‌ డేట్‌ అయితే మార్చక తప్పని పరిస్థితి అంటున్నారు.

సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మంచి రంజు మీద ఉన్నప్పుడు సినిమా తీసుకొచ్చి ఇబ్బందిపడకూడదు అనేటి టీమ్‌ మాట అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కొత్త డేట్‌ ఏం అవ్వొచ్చు అనే చర్చ మొదలైంది. ఎందుకంటే దేశంలో తెరకెక్కుతున్న అతి పెద్ద సినిమా ‘కల్కి 2898 ఏడీ’ అని చెబుతున్నారు. ఇలాంటి సినిమాను లాంగ్‌ వీకెండ్‌ లేదా ఫెస్టివల్‌ సీజన్‌లో రిలీజ్‌ చేయాలని చూస్తారు. వరుస సెలవులు ఉంటే సినిమాకు మంచిది అనేది వారి ఆలోచన.

ఈ క్రమంలో సినిమాను ఆగస్టు రెండో వారంలో తీసుకొస్తారేమో అనే డౌట్ ఫ్యాన్స్‌లో కలుగుతోంది. అదే జరిగితే తారక్‌ వర్సెస్‌ ప్రభాస్‌ (Prabhas)  అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆ సీజన్‌లో తారక్‌ (Jr NTR) ‘దేవర’ (Devara)  రావాల్సి ఉంది. అల్లు అర్జున్ (Allu Arjun)  – సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే ఆ సినిమా వస్తుందో లేదో అప్పటికి సినిమా అవుతుందో లేదో అనే డౌట్‌ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏమో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను ఆ డేట్‌కి తీసుకొస్తారు అని చెబుతున్నారు. ఒకవేళ ‘పుష్ప 2’ కూడా వచ్చేస్తా అంటే… ‘పాన్‌ ఇండియా వర్సెస్‌ పాన్‌ ఇండియా’ అవుతుంది. కానీ ఇది జరిగే అవకాశం తక్కువ. కాబట్టి రెండింటిలో ఒక్క సినిమానే వస్తుంది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus