బోయపాటిలో మార్పుకి కారణం??

  • March 5, 2016 / 10:21 AM IST

యంగ్ డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ఇండస్ట్రీకి ఇచ్చిన హిట్స్ కలకాలం మరచిపోలేనివి. అయితే సినిమాపై మంచి పట్టు ఉన్న ఈ యువ దర్శకుడు సినిమాకు సంభందించిన అన్ని విభాగాల్లో అంటే 24ఫ్రేమ్స్ అంటాం కదా, అలా అన్నింటిలో మంచి పట్టు కలిగి ఎవరి దగ్గరనుంచి ఎంత పిండాలో అంత పిండేస్తాడు. ముఖ్యంగా ఆయన మ్యూజిక్ దర్శకుల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తనకు నచ్చే వరకూ ట్యూన్స్ మార్పిస్తూ ఎన్నో ఇబ్బందులు పెడతాడు. అయితే ఇదే విషయమై గతంలో బోయపాటికి యంగ్ తరంగ్ దేవి శ్రీ ప్రసాద్ కి బహిరంగంగా పెద్ద గొడవే జరిగింది. మరి ఆ గొడవతో రియలైస్ అయ్యాడో, లేకపోతే తాను వెళుతున్న రూట్ కరెక్ట్ కాదు అని తెలుసుకున్నాడో తెలీదు కానీ మొత్తానికి బోయపాటి మారిపోయాడు. ఎంతలా అంటే….ఈ ఉదాహరణె చూడండి….

మ్యూజిక్ విషయంలో గతంలో మ్యూజిక్ డైరెక్టర్స్ ను పిండేసిన ఈ దర్శకుడు ‘సరైనోడు’ సినిమా విషయంలో ఎటువంటి టార్చర్ లేకుండానే థమన్ తో పని చేయించుకుంటున్నాడు.  బోయపాటి కి ఏ మ్యూజిక్ ఓ పట్టాన నచ్ఛదు. కానీ తను ఓపిగ్గా కూర్చొని తనకి కావాల్సిన మార్పులను అడిగి మరీ మార్పించుకుంటున్నాడంటా. దీంతో బోయపాటిలోని మార్పుని చూసిన థమన్ యూనిట్ నిజంగానే ఆశ్ఛర్యపోయిందంట. ఇక ఆయన ప్రవర్తన చూసిన అక్కడ వారందరూ షాక్ అవుతున్నారంట. ఏది ఏమైనా…శెబాష్ బోయపాటి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus