Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

బోయపాటి శ్రీను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. మాస్ లో ఇతని సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ పెట్టగల సత్తా ఉన్న దర్శకుడు. కాకపోతే బాలయ్యతో తప్ప వేరే హీరోలతో హిట్లు కొట్టలేడు అనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. ముఖ్యంగా యంగ్ హీరోలతో సినిమాలు చేసిన ప్రతిసారి బోయపాటి శ్రీను ఎక్కువగా ప్లాపులే ఇచ్చాడు అనేది వాస్తవం.

Boyapati Srinu 

కెరీర్ ప్రారంభంలో రవితేజ, వెంకటేష్ వంటి హీరోలకి హిట్లు ఇచ్చాక.. బాలయ్యతో జర్నీ ప్రారంభించాడు బోయపాటి. వీరి కాంబినేషన్లో ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘అఖండ 2’ రూపుదిద్దుకుంటుంది. ఇటీవల వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. అయితే ఆ తర్వాత ఏ హీరోతో బోయపాటి సినిమా చేస్తాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.

అల్లు అర్జున్ కి బోయపాటి శ్రీనుతో సినిమా చేయడం అంటే ఇష్టమే. కానీ ఇప్పుడు బన్నీ … అట్లీకి లాక్ అయ్యాడు. సీనియర్ హీరోలు కూడా తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.కాబట్టి మళ్ళీ మిడ్ రేంజ్ హీరోతోనే బోయపాటి సినిమా చేయాలి.ఈ క్రమంలో నాగ చైతన్యతో బోయపాటి సినిమా ఓకే అయినట్టు టాక్ నడుస్తుంది.

‘తండేల్’ తో రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు నాగ చైతన్య. ప్రస్తుతం ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. అది నాగ చైతన్య కెరీర్లో 24వ సినిమాగా తెరకెక్కుతుంది. దాని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన ల్యాండ్ మార్క్ మూవీ అయిన 25వ సినిమా చేసే అవకాశం ఉంది. ’14 రీల్స్’ ప్లస్ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 

రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus