Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్’ అనే పాన్ ఇండియా సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. జూలై 31న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది ‘కింగ్డమ్’.

Kingdom Trailer

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ చిత్రాన్ని ఏకంగా రూ.130 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 2 పార్టులుగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన గ్లింప్స్, ఇటీవల వచ్చిన టీజర్, పాటలు వంటివి అన్నీ.. ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాపై ఉన్న అంచనాలు పెంచాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ డోస్ ను పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా.. ఈరోజు ట్రైలర్ లాంచ్ వేడుకని తిరుపతిలో నిర్వహించారు. అలాగే ట్రైలర్ ను కూడా కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో వదిలారు.

‘కింగ్డమ్’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 37 సెకన్ల నిడివి కలిగి ఉంది. సూరి(విజయ్ దేవరకొండ) స్పైగా మారి ఒక జైలుకు వెళ్లడం, అక్కడ అనుకోకుండా తన అన్న(సత్యదేవ్) ను కలుసుకోవడం, అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ మంచి హై ఇచ్చే విధంగా డిజైన్ చేసినట్లు ఉన్నారు. ట్రైలర్ తో కథ పై ఒక క్లారిటీ ఇచ్చారు. సత్య దేవ్ పాత్రలో కూడా డెప్త్ ఉంటుంది అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ లుక్స్, యాక్షన్ బ్లాక్స్ కి సంబంధించిన విజువల్స్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా డిజైన్ చేసినట్లు స్పష్టమవుతుంది. ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus