బోయపాటి చిత్రంలో స్టార్ హీరోలు వారేనా..?

సరైనోడు చిత్ర విజయం తరువాత బోయపాటి శ్రీను.. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించనుంది. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినవచ్చాయి. ఆ ఇద్దర్లో ఒకరు వెంకటేష్, మరొకరు ఆదిపినిశెట్టి అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సరైనోడు చిత్రీకరణ సమయంలో తన తదుపరి చిత్రంలో ఓ పాత్ర చేయాలని ఆది వద్ద బోయపాటి మాట తీసుకున్నాడని.. దాంతో ఈ చిత్రంలో ఆది నటించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus