Ram,Boyapati Srinu : రామ్ – బోయపాటి సినిమాలో బుల్ ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుందట!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు భీవత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అది ప్రూవ్ అయ్యింది. ప్రస్తుతం రామ్.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. సహజంగానే బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. అలాంటిది ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన రామ్ ను.. ఇంకెంత ఎనర్జిటిక్ గా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది.

శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ దసరా కానుకగా అక్టోబర్ 20 న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఓ బుల్ ఫైట్ ఉంటుందట. సినిమాలో ఈ ఫైట్ హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. మాస్ ఆడియన్స్ పూనకాలు తెప్పించే విధంగా ఈ ఫైట్ ఉంటుందట. ఈ ఫైట్ ను 11 రోజుల పాటు చిత్రీకరించారు అని తెలుస్తుంది.

అంతేకాదు ఈ ఫైట్ చిత్రీకరణ కోసం లైట్స్ ఎక్కువగా వాడారట. మళ్లీ వాటికి పవర్ అందించడం కోసం 28 జెనరేటర్ లు వాడారట. ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్న స్టూడియోలో అన్ని జెనరేటర్లు లేకపోవడంతో నిర్మాత బయటనుండి తెప్పించి మరీ షూట్ చేశారట. అంత భారీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రామ్ – ఊర్వశి రౌతుల మధ్య ఓ ఎనర్జిటిక్ మాస్ సాంగ్ కూడా ఉంటుందట. ఆ పాట కూడా మాస్ తో చిందులు వేయించే విధంగా ఉంటుందని సమాచారం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus