Boyapati Srinu: థమన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బోయపాటి శ్రీను.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో థమన్ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. అఖండ మూవీకి బీజీఎంతో థమన్ ప్రాణం పోశారు. థమన్ బీజీఎం లేకుండా అఖండ మూవీని చూస్తే ప్రేక్షకులు ఏదో వెలితిగా ఫీలవుతారనే సంగతి తెలిసిందే. అయితే బోయపాటి శ్రీను మాత్రం థమన్ బీజీఎం లేకుండా చూసినా అఖండలోని సీన్లు హై లో అనిపిస్తాయని తెలిపారు.

ఒక ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను (Boyapati Srinu) మాట్లాడుతూ అఖండ సినిమాను రీ రికార్డింగ్ లేకుండా చూసినా ప్రేక్షకులు గర్వంగా ఫీలవుతారని ఆ సినిమాకు అంత దమ్ముందని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సైతం ఏదైతే అద్భుతమైన కల్ట్ ఉందో దానిపై అద్భుతంగా చేయగలిగాడని బోయపాటి శ్రీను కామెంట్లు చేశారు. బోయపాటి శ్రీను కామెంట్లను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

థమన్ విషయంలో కొన్ని విమర్శలు ఉండవచ్చని అయితే అఖండ సినిమా విషయంలో మాత్రం థమన్ స్థాయిని తగ్గించేలా కామెంట్ చేయడం రైట్ అనిపించుకోదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోయపాటి శ్రీను గొప్ప దర్శకుడు కావచ్చని కానీ అదే సమయంలో థమన్ కూడా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

బోయపాటి శ్రీను థమన్ మధ్య ఈ కామెంట్లు గ్యాప్ ను పెంచుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోయపాటి శ్రీను సినిమాలకు థమన్ దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బోయపాటి శ్రీను, థమన్ రెమ్యునరేషన్లు భారీ రేంజ్ లో ఉన్నాయి. బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. బోయపాటి శ్రీను రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus