Adipurush: ‘ఆదిపురుష్’ ను తాకిన బాయ్ కాట్ సెగ..!

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రమోషన్స్ అక్టోబర్ 2 నుండి ప్రారంభం అయ్యాయి. ఆ రోజున టీజర్ లాంచ్ తో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈ చిత్రంలో ప్రభాస్ .. రాఘవ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్ కృతి సనన్ జానకి పాత్రను పోషిస్తుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ‘ఆదిపురుష్’ టీజర్ యూట్యూబ్ లో అయితే రికార్డులు సృష్టిస్తుంది కానీ..

అది జనాలకు ట్రోలింగ్ స్టఫ్ గానే మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ విజువల్స్ ను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. దీనిని ఎక్కువగా ఫ్యాన్ వార్స్ కోసం వాడుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలకు బాయ్ కాట్ సెగ తగులుతున్న సంగతి తెలిసిందే. ‘లాల్ సింగ్ చడ్డా’ ‘లైగర్’ ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాలకు బాయ్ కాట్ సెగ గట్టిగా తగిలింది.

ఇప్పుడు ‘ఆదిపురుష్’ కి కూడా గట్టిగానే తగులుతుంది అని చెప్పాలి. ‘ఆదిపురుష్’ టీజర్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయట. అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి అని అంతా చెబుతున్నారు.రావణాసురుడు స్వతహాగా శివుని భక్తుడు. అయితే కొన్ని సీన్లలో సైఫ్ నుదుటిపై నామాలు లేవట. ఒంటిపై జంధ్యం కూడా మిస్ అయ్యింది అని అంటున్నారు.

పుష్పక విమానం స్థానంలో పక్షి ఉండటం, రావణాసురుడు గెటప్ అల్లావుద్దీన్ ఖిల్జీని పోలి ఉండటం, వానర సైన్యం కాస్త గొరిల్లా సైన్యంలా ఉందని చెబుతూ.. అంతా విమర్శిస్తున్నారు. అంతేకాదు హనుమంతుడికి లెదర్ బట్టలు తొడిగారని.. ఆయన ముస్లింలా కనిపిస్తున్నాడని చెప్పి ‘#BoycottAdipurush’ హ్యాష్ ట్యాగ్ ను ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus