Pushpa2: పుష్పను టార్గెట్ చేసిన బాలీవుడ్.. సౌత్ ఆడియన్స్ రియాక్షన్ ఇదే!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియకపోయినా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. పుష్ప2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా పుష్ప2 టీజర్ 5 భాషల్లో రిలీజ్ కాగా హిందీలో ఎక్కువ వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప2 హిందీ టీజర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకోగా పుష్పరాజ్ అమ్మవారి గెటప్ లో కనిపించిన పోస్టర్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

అయితే అమ్మవారి గెటప్ లో ఉన్న పుష్పరాజ్ తుపాకీ పట్టుకోవడంపై బాలీవుడ్ ట్విట్టర్ పేజీ విమర్శలు చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆ విమర్శలకు బన్నీ ఫ్యాన్స్ సైతం ధీటుగా బదులిస్తుండటం గమనార్హం. శత్రు సంహారం చేయడానికి ఎంతోమంది దేవతలు, దేవుళ్లు ఆయుధాలను పట్టారని ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్ప2 సినిమాలో శత్రుసంహారం కోసమే గన్ పట్టాడని అభిమానులు చెబుతున్నారు.

ఒక ప్రాంత ఆచారాన్ని ఆ పోస్టర్ లో చూపించారని ప్రతిదీ వివాదం చేయొద్దని బాయ్ కాట్ అంటూ కామెంట్లు చేసినా పుష్ప ది రూల్ పై ఆ ఎఫెక్ట్ ఏ మాత్రం ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఆ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో లేదో చూడాలి. పుష్ప2 బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పుష్ప2 (Pushpa2) సినిమా రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అన్ని వర్గాల ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాలని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా బన్నీ క్రేజ్ ను రెట్టింపు చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus