Brahmaji, Prabhas: బ్రహ్మాజీ సోషల్‌ మీడియాని ఎంత బాగా ఫాలో అవుతున్నాడో?

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ.. సోషల్‌ మీడియాలో బాగా చురుకుగా ఉంటారు. ఎప్పుడూ ఏదో పోస్ట్‌ పెడుతూనో, లేకపోతే ఇంకెవరి పోస్టులను చూస్తూనో ఉంటారు. సగటు నెటిజన్‌లా ఆయన సోషల్‌ మీడియా యూసేజ్‌ ఉంటుంది అని చెబుతుంటారు. అంత టైమ్‌ ఆయనకు ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేస్తుంటారు అనే విషయాలు మనకు తెలియవు కానీ.. ఆయన పోస్ట్‌లు, డైలాగ్‌లు, పంచ్‌లు వింటుంటే అలానే అనిపిస్తుంది. మొన్నీమధ్య ‘అంకుల్‌ ఏంట్రా అంకుల్‌ కేసు పెడతా’ అంటూ సోషల్‌ మీడియాలో సందడి చేసిన బ్రహ్మాజీ..

ఇప్పుడు ప్రభాస్‌ డైలాగ్‌తో వైరల్‌ అవుతున్నారు. దీనికి కారణం ఆయనను బాగా ఆటపట్టించే, ఆయన బాగా ఆటపట్టించే యాంకర్‌ సుమ చేస్తున్న షోకి ఆయన రావడమే. ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ అనే సినిమాలో బ్రహ్మాజీ ఓ ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నవంబరు 4న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా సినిమా ప్రధాన నటులు సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా, సుదర్శన్‌తో కలసి బ్రహ్మాజీ షోకి వచ్చారు.

ఈ ఎపిసోడ్‌ ఈ శనివారం టెలీకాస్ట్‌ అవుతుంది. అయితే దీని ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో బ్రహ్మాజీ ఒకే డైలాగ్‌తో అదరగొట్టారు. అదే ‘కమ్‌ టు మై రూమ్‌’. ఈ డైలాగ్‌ ఎక్కడో విన్నట్లుంది కదా. మొన్నీమధ్య ‘ఆదిపురుష్‌’ టీజర్‌ రిలీజ్‌ తర్వాత ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో బయటికొచ్చింది. ఆ వీడియోలో దర్శకుడు ఓం రౌత్‌ను ప్రభాస్‌ తన రూమ్‌కి ఓసారి రమ్మని పిలుస్తాడు. సినిమా టీజర్‌ బాగోలేకపోవడం వల్ల ప్రభాస్‌ గదిలోకి పిలిచి ఫుల్‌ క్లాస్‌ ఇచ్చాడని నెటిజన్లు ఓ కథ అల్లేశారు.

దాంతో ఆ డైలాగ్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు బ్రహ్మాజీ ‘క్యాష్‌’ షోలో ఆ డైలాగ్‌తోనే ఫుల్‌ ఫన్‌ ఇచ్చాడు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా.. ఏమన్నా ‘కమ్‌ టు మై రూమ్‌’ అని అంటూ.. సందడి చేశారు. దీంతో బ్రహ్మాజీ సోషల్ మీడియాను ఇంతగా ఫాలో అవుతారా అని నెటిజన్లు, ట్రోలర్లు అనుకుంటున్నారు. ‘అంకుల్‌’ అనే డైలాగ్‌ ఎందుకు వేశారో మీకు తెలిసే ఉంటుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus