Brahmanandam: అలాంటి తేడాలు ఇండస్ట్రీలో అసలు ఉండవు.. బ్రహ్మానందం కామెంట్స్ వైరల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో వందల సినిమాలలో హాస్యనటుడిగా నటించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. అయితే ప్రస్తుతం వయసు పై పడటంతో బ్రహ్మానందం ఎక్కువ సినిమాలలో నటించకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. తాజాగా బ్రహ్మానందం పంచతంత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

ఇకపోతే తాజాగా బ్రహ్మానందం చెడ్డి గ్యాంగ్ తమాషా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రైలర్ లాంచ్ అనంతరం బ్రహ్మానందం చిత్ర పరిశ్రమ గురించి హాస్య సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.వెంకట్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే గాయత్రి పటేల్ హీరోయిన్ గా…అబూజ, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పై సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మించిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ..

హాస్యనటులు తీసే సినిమాలు మంచి సక్సెస్ కావాలని, హాస్యం బయటకు రావాలని తన గురువు జంధ్యాల ఎప్పుడు తనకు చెప్పేవారని బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు. హాస్యాన్ని బతికించాలని కామెడీ నేపథ్యంలో తెరకేక్కిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి తాను హాజరయ్యానని తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఏ సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమా మంచి హిట్ అవుతుందని తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అని వ్యత్యాసాలు ఎప్పుడు ఉండవని కేవలం కంటెంట్ ఉంటేనే ఆ సినిమాలు పెద్దవైన చిన్నవైన ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి వసూలు రాబడతాయని ఈ సందర్భంగా బ్రహ్మానందం చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus