షాకింగ్ డెసిషన్ తీసుకున్న బ్రహ్మానందం..!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఎవరంటే ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్ కూడా టక్కున చెప్పే పేరు బ్రహ్మానందం. ఈయన్ని హాస్య బ్రహ్మ అని కూడా అంటుంటారు. 20 ఏళ్ళ పాటు టాలీవుడ్ ను ఏలాడు బ్రహ్మానందం. కేవలం ఈయన కామెడీ వల్లే హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. ‘జల్సా’ ‘రెడీ’ ‘ఢీ’ ‘కృష్ణ’ వంటి సినిమాల్లో బ్రహ్మానందం కామెడీనే హైలెట్ అవ్వడం వల్ల అవి హిట్లయ్యాయి అని చాలా మంది చెబుతుంటారు. ఈయన కామెడీని అడ్డం పెట్టుకుని కం బ్యాక్ ఇచ్చిన హీరోలు కూడా చాలా మందే ఉన్నారు.

‘జల్సా’ తో పవన్ కళ్యాణ్, ‘దూకుడు’ తో మహేష్ బాబు, ‘రెడీ’ తో రామ్, ‘లౌక్యం’ తో గోపీచంద్ వంటి హీరోలు తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారు అంటే.. బ్రహ్మానందం కామెడీ వల్లనే అని చెప్పాలి. అయితే ఇప్పుడు ట్రెండ్ అయ్యే ఎన్నో మీమ్స్ లో బ్రహ్మీనే కనిపిస్తూ ఉంటారు. కానీ సినిమాల్లో మాత్రం ఈయన ఎక్కువగా కనిపించడం లేదు. దానికి ప్రధాన కారణం కొత్త కమెడియన్లు ఎక్కువైపోవడం వల్లనే అని చెప్పాలి. అంతేకాదు బ్రహ్మీ పారితోషికం కూడా ఎక్కువ తీసుకుంటారని భావించి.. ఆయన్ని కాంటాక్ట్ చెయ్యడం కూడా తగ్గించేశారు దర్శకనిర్మాతలు.

ఇది పక్కన పెడితే.. తాజా సమాచారం ప్రకారం బ్రహ్మానందం.. సీరియల్స్ లో నటించడానికి ఓకే చెప్పారట. ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యే ఓ సీరియల్ లో నటించడానికి బ్రహ్మీ ఓకే చెప్పారని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి డిస్కషన్లు కూడా పూర్తయ్యాయని సమాచారం. గతంలో కూడా ఓ కామెడీ షో చేశారు బ్రహ్మానందం. కానీ ఆ షో సక్సెస్ కాలేదు.ఇక ‘సీరియల్స్ లో నటించడానికి రెడీ అయ్యారు అంటే.. సినిమాలకు బ్రహ్మీ గుడ్ బై చెప్పినట్టే’ అని కొందరు విశ్లేషిస్తున్నారు.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus