Brahmanandam: ‘పెళ్లిసందD’లో నవ్వులరాజు అదిరిపోయే పాత్ర

సినిమాల్లో అదిరిపోయే పాత్రలు టీవీ షోల్లో రావడం కామన్‌. గతంలో ఇలాంటి సినిమా పాత్రలను బుల్లితెర నటులు టీవీ షోస్‌లో నటించి మెప్పించారు. అయితే బుల్లితెర మీద హిట్‌ అయిన పాత్రలు సినిమాల్లోకి వెళ్లడం చాలా తక్కువే అని చెప్పాలి. అలా ఇప్పుడు ఓ టీవీ షోలోని క్యారెక్టర్‌ టీవీల్లోకి వెళ్తోందట. అంతేకాదు ఆ పాత్రను పోషిస్తోంది టాలీవుడ్‌ నవ్వుల రారాజు బ్రహ్మానందం అట. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ పాత్ర గురించే టాక్‌ నడుస్తోంది.

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో ‘పెళ్లిసందD’ అనే సినిమా సిద్ధమవుతోంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఆ సినిమాతో కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇందులో బ్రహ్మానందానికి ఓ పాత్ర ఉండాల్సిందే అని దర్శకేంద్రుడు ఫీల్‌ అయ్యారట. అప్పుడే ఈ బిల్డప్‌ బ్రహ్మీ ఆలోచన వచ్చిందట. బిల్డప్‌ బ్రహ్మీ అంటే ‘జబర్దస్త్‌’లో బిల్డప్‌ బాబాయి పాత్ర గుర్తొచ్చిందా? మీ ఊహ కరెక్టే. ఎందుకంటే ఈ సినిమాలో బ్రహ్మానందం బిల్డప్‌ బాబాయి పాత్ర పోసిస్తున్నారట.

బిల్డప్‌ బ్రహ్మీకి సంబంధించి ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిందట. ఆ పాత్ర వెండితెరపై కచ్చితంగా నవ్వులు పూయిస్తుందట. బ్రహ్మానందం నుండి ఇటీవల కాలంలో సరైన నవ్వులు పండింది లేదు. ‘జాతిరత్నాలు’లో కనిపించింది కాసేపు అయినా నవ్వించారు. ఇప్పుడు బిల్డప్‌ బ్రహ్మీ పాత్రతో ఇన్నాళ్ల నవ్వుల లోటును తీరుస్తారని అంటున్నారు. గెటప్‌ శ్రీనే ఆ పాత్రను అంతబాగా చేస్తే… బ్రహ్మానందం ఇంకెంత బాగా చేశారో అని ఆలోచిస్తున్నారా? కచ్చితంగా అదరగొట్టేసుంటారు

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus