థియేటర్స్ కు పండుగను తీసుకొస్తున్న సూపర్ స్టార్ మహేష్ ‘బ్రహ్మోత్సవం’

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘బ్రహ్మోత్సవం’. మే 20న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ నటించిన ఈ చిత్రం విడుదల రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు థియేటర్స్ వద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. థియేటర్స్ వద్ద అలంకరణ చూస్తుంటే మండు వేసవిలో సంక్రాంతి పండుగను తలపిస్తుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం పబ్లిసిటీ విషయంలో పివిపి సంస్థ ఇంతకు ముందెన్నడూ లేనంత కేర్ తీసుకుంది. భారీ హోర్డింగ్స్, వినైల్స్ ఏర్పాటు చేసి ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చింది.

సెన్సార్ రిపోర్ట్ కూడా క్లీన్ ‘యు’ రావడంతో శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబుకు మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా క్షణం, ఊపిరి చిత్రాలు తర్వాత పివిపి సినిమాకు హ్యాట్రిక్ హిట్ ఇస్తాడని అంటున్నారు. మే 20న తెలుగు సినిమా ప్రేక్షకులకు, సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus