బ్రహ్మోత్సవం ప్రీ రివ్యూ | మహేష్ బాబు | సమంత కాజల్

శ్రీ వేంకటేశ్వరుని పాదాలతో ఉన్న బ్రహ్మోత్సవం తొలి పోస్టర్ పబ్లిష్ అయినప్పటి నుంచే ఈ చిత్రానికి అంచనాలు పెరగడం మొదలయ్యాయి. ఒక ప్రశాంత మైన సినిమా ఇది అని ఆ పోస్టర్ చెప్పకనే చెప్పింది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి క్లీన్ చిత్రాలను అందించిన శ్రీకాంత్ అడ్డాల నుంచి వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రం కావడంతో ఎన్నో ఆశలతో అభిమానులు థియేటర్లకు చేరుకోవడం ఖాయం. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఉన్న అంశాలు ఉన్నాయో తెలుసుకుందాం.

కథలోకి వెళితే ..
విజయవాడలో విలువలు కలిగి ఉన్న ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆ ఇంట్లో అమ్మాయి పెళ్లి. నిశ్చితా ర్దానికి ఆ కుటుంబంలో ఒకడైన మహేష్ బాబు అమెరికా నుంచి వస్తాడు. ఈ వేడుకకు సమంత కూడా వస్తుంది. మహేష్ ని చూడగానే లవ్ లో పడిపోతుంది. ఇక్కడకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మనుషుల మధ్య ఏదో వెలితి ఉందని గ్రహిస్తాడు. కుటుంబ సభ్యుల బంధువులు కూడా ఈ పెళ్ళికి హాజరయితే బాగుంటుందని ఆశపడుతున్నారని తెలుసుకుంటాడు. వారు ఎక్కడేక్కడున్నారని అడిగితే ఏడు తరాల వారు దేశమంతా స్థిరపడ్డారని చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న సమంత ఆశ్చర్యపోతుంది. పూర్వీకులను వెతికేందుకు మహేష్ బయలు దేరితే అతనితో సమంత కూడా వెళుతుంది. చెన్నై, వారణాసి, డిల్లీ, ఉదయపూర్ ప్రాంతాలలో తిరిగి శుభ కార్యానికిరావాలని తమ పూర్వీకులను పిలుస్తాడు. తిరిగి రాగానే తన లవర్ కాజల్ ఇంటికి వచ్చేసి ఉంటుంది. తమ వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారో వారి గురించి మహేష్ చెబుతుంటే కుటుంబ సభ్యులు ఎమోషన్ అవుతారు. సమంతకి ఈ కుటుంబం కలిసి ఉండాలని కోరిక. అందుకే మరదలిని మహేష్ పెళ్లి చేసుకోవాలని పెద్దలు చెప్పడం తో తన ప్రేమను బయటకు చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. మహేష్ యే నిర్ణయం తీసుకుంటాడోనని ఎదురుచూస్తూ ఉంటుంది.

తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి ఊటీ కి పోయి సరదాగా గడిపి వస్తారు. పెళ్ళిపనులు ఊపందుకుంటాయి. పూర్వీకులందరూ వస్తారు. కలిసి మాట్లాడుకుంటారు. ఈ సందర్భంగా మరదలు ప్రణీ తను మహేష్ పెళ్లి చేసుకుంటే మనం ఇంకా బాగా కలిసి ఉండవచ్చు అంటారు. ముఖ్యంగా మహేష్ క్లైమాక్స్ లో చెప్పే సీన్లో అందరూ కంట తడి పెడతారు. డబ్బింగ్ సమయంలో మహేష్ కళ్ళు కూడా చెమ్మ గిల్లాయని సూపర్ స్టార్ స్వయంగా చెప్పారు. కుటుంబం కోసం మహేష్ మరదలిని పెళ్లి చేసుకున్నాడా? తను ఎంతో ఇష్టపడే కాజల్ ను వదిలేస్తాడా? అనేది తెర పైనే చూడాలి.

ఆర్టిస్టుల పని తీరు..
మహేష్ బాబు, సమంత, కాజల్ లతో క్యూట్ లవ్ పండిస్తూనే కుటుంబ సభ్యులతో సెంటిమెంట్ ని పండిచాడు మహేష్. సినిమాను మొత్తం మహేష్ నడిపించుకుంటూ పోతాడు. సత్యరాజ్, రేవతి, జయసుధ, రావు రమేష్, షాయాజీ షిండే, ప్రణీత, బేబీ అవంతిక ఇలా 21 మంది ప్రముఖ నటులు తన పరిధి మేరకు నటనను ప్రదర్శించి ఉంటారు.

సాంకేతిక నిపుణుల పనితీరు ..
మిక్కి జె మేయర్ పాటలు ఇప్పటికే మనసుకు హత్తుకున్నాయి. అవి సినిమాలో సందర్భాను సారం వస్తూ కథాగమనంలో కలిసి పోతాయి. అంతే కాదు వాటికి పీవీపీ నిర్మాణ విలువలు, రత్నవేలు లెన్స్ తోడయి గ్రాండ్ గా కనిపిస్తాయి. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ ఫ్యామిలీ డ్రామా సన్నివేశాల్లో కన్ను చెమ్మగిల్లేలా చేసాయి.

ప్లస్ లు
మహేష్ లుక్, యాక్టింగ్
సమంత, కాజల్, ప్రణీత గ్లామర్, వీరితో మహేష్ చేసే రొమాన్స్
కుటుంబ సభ్యుల మధ్య వచ్చే సన్నివేశాలు

మైనస్
స్లో నరేషన్,
ఫైట్ లు,
మాస్ జనాలకు నచ్చే అంశాలు నిల్

చివరిగా
ఆప్యాయతలు, ప్రేమ ఉన్న ఉమ్మడి కుటుంబాన్ని కళ్ల ముందు చూస్తాం. ఆ కుటుంబంలో నేను కూడా ఉంటే చాలా బాగుంటుందని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. మరోసారి మహేష్ బ్రహ్మోత్సవం తో రికార్డు లను తిరగ రాస్తాడు.

పైన తెలిపిన అన్నీ అంశాలు ఫిల్మీ ఫోకస్ బ్రహ్మోత్సవం ప్రీ రివ్యూ (అంచనాలు) మాత్రమే. అసలైన రివ్యూ కోసం శుక్ర వారం చూడండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus