Bro Movie: పవన్‌కు కష్టం కాకుండా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పెడతారట.. నిజమేనా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మరో అవతారంలో ఉన్నారు. అదే జనసేనాని. ఆ మధ్య వరుసగా సినిమాలకు డేట్స్‌ ఇస్తూ వచ్చిన పవన్‌.. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు. ‘వారాహి యాత్ర’ పేరుతో ప్రజల మధ్యకు వచ్చారు. గోదావరి జిల్లాల్లో ఆయన యాత్ర సాగుతోంది. దీంతో ఇప్పుడు ఆయన సినిమాలకు సమయం కేటాయించడం కష్టం అని అనుకుంటున్నారు. అయితే ‘బ్రో’ సినిమా ప్రచారం షురూ చేయాల్సి ఉంది. అయితే దీనికి ఆ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఓ ప్లాన్‌ వేసింది అంటున్నారు.

‘బ్రో’ సినిమా విడుదలకు సమయం వస్తోంది. మహా అయితే నెల రోజులే ఉంది. దీంతో ఇంటర్వ్యూలు షురూ చేసి, టైమ్‌ చూసుకుని ప్రీ రిలీజ్‌ ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారు. పవన్‌ సినిమా ఇంటర్వ్యూ ఇప్పట్లో ఇవ్వడం కష్టమే.. కాబట్టి మిగిలిన టీమ్‌తో ఇంటర్వ్యూలు ఇస్తారు. కుదిరితే రికార్డెడ్‌ ఇంటర్వ్యూ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇవన్నీ ఓకే కానీ పవన్‌ బిజీ షెడ్యూల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వస్తాడా అనే డౌట్‌ చాలామందికి ఉంది. దీని కోసం టీమ్‌ కొత్త ఆలోచన చేసిందట.

ప్రస్తుతం పవన్‌ గోదావరి జిల్లాల్లో ఉన్నాడు కాబట్టి.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అక్కడే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో వేదిక కోసం వెతుకులాట జరుగుతోందట. అన్నీ ఓకే అయితే త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు. అయితే ఇప్పుడున్న ఏపీ రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతవరకు సులభంగా పర్మిషన్లు వస్తాయో చూడాలి.

అన్నట్లు పవన్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా విషయంలో భయపడొద్దు అని కూడా అంటున్నారు. ఆ కథ పవర్‌ స్టార్‌కి సరిపడదు అనుకుంటున్న వాళ్లకు ఇది తీపి కబురే. సినిమాను పూర్తిగా మాస్‌ హీరో స్టైల్‌లోకి త్రివిక్రమ్‌ మార్చేశారట. ‘వినోదాయ చిత్తాం’ చూసినవాళ్లు ఈ సినిమాను చూస్తే కొత్తగా ఫీల్‌ అవుతారు అని అంటున్నారు. చూద్దాం ఆ విషయం ఏంటో జులై 28న తెలిసిపోతుంది. ఆ రోజే ‘బ్రో’ విచ్చేస్తారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus