‘ఉప్పెన’ డైరెక్టర్ నెక్స్ట్ ఎవరితో అంటే..?

సుకుమార్ దగ్గర శిష్యుడిగా పని చేసిన బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడిపై టాలీవుడ్ నిర్మాతలు, హీరోల దృష్టి పడింది. ‘ఉప్పెన’ తదుపరి సినిమా కూడా మైత్రి మూవీస్ బ్యానర్ లోనే చేయాలని అగ్రిమెంట్ రాశాడు బుచ్చిబాబు. తన రెండో సినిమాగా ఓ స్పోర్ట్స్ డ్రామా రాసుకున్నాడు. ఆ కథ ఎన్టీఆర్ కి యాప్ట్ అవుతుందని.. అతడితోనే సినిమా చేయాలనుకున్నాడు.

కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ అందుబాటులో లేడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టనున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఎన్టీఆర్ ఖాళీ అవ్వాలంటే కనీసం రెండేళ్లకు పైగానే పడుతుంది. అందుకే ఈ స్పోర్ట్స్ డ్రామాని పక్కన పెట్టి.. తన దగ్గర ఉన్న మరో కథను సిద్ధం చేస్తున్నాడు. హీరోని తీసుకొచ్చే బాధ్యత మైత్రి మూవీస్ వాళ్లే చూసుకుంటారు.

ఇప్పుడు మైత్రి సంస్థ నాగచైతన్య-బుచ్చిబాబు కాంబినేషన్ సెట్ చేయాలని అనుకుంటున్నారు. బుచ్చిబాబు రాసుకున్న కథ చైతూకి నచ్చితే ఈ కాంబో సెట్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం చైతు చేతిలో కూడా కొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవి చేస్తూనే బుచ్చిబాబుకి కూడా డేట్స్ ఇస్తాడా..? లేదా అవన్నీ పూర్తి చేసి చేస్తాడా అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus