అబ్బో.. అల్లు వారి ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

పద్మశ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారి 99వ జ‌యంతి రోజున.. ఓ కొత్త స్టూడియోని నిర్మించబోతున్నట్టు అల్లు వారి ఫ్యామిలీ ప్ర‌క‌టించిన సంగతి అందరికీ తెలిసిందే.’అల్లు స్టూడియోస్’ పేరుతో ఈ స్టూడియోని నిర్మించబోతున్నారు. హైదరాబాద్లోని గండిపేట్ స‌మీపంలో ఉన్న ప్రాంతంలో ఈ స్టూడియోని నిర్మించబోతున్నారని తెలుస్తుంది. ఇందుకోసం 10ఎకరాల సువిశాల స్థలాన్ని కూడా కేటాయిస్తున్నారట. టాలీవుడ్లో రామోజీ ఫిలిం సిటీ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ కు ధీటుగా ‘అల్లు స్టూడియోస్’ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ అలాగే నిర్మాణ రంగంలోనూ అల్లు అరవింద్ గారికి తిరుగులేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పుడు స్టూడియోని నిర్మించడంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ‘ ‘అల్లు స్టూడియోస్’ కోసం ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు?’ అనే డౌట్ అందరిలోనూ ఉంది. అందుతున్న సమాచారం.. ప్రకారం ‘అల్లు స్టూడియోస్’ కోసం ఏకంగా 80కోట్ల వరకూ బడ్జెట్ పెడుతున్నారట. అల్లు అరవింద్ గారు తన ‘ఆహా’ కు సంబంధించిన వెబ్ సిరీస్ లు మరియు వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కావాల్సిన డబ్బింగ్ రూమ్స్ వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus