Devara: ‘దేవర’ నుండి అర్జెంట్‌గా టీజర్‌ రిలీజ్‌ కారణం అదేనా?

పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు ‘బడ్జెట్‌’ సమస్య వస్తూనే ఉంటుంది. గతంలో చాలా సినిమాల గురించి ఈ మాట విన్నాం. అనుకున్న సమయానికి ఫండ్స్‌ అందుబాటులోకి రాలేదు అంటూ సినిమా షూటింగ్‌లు ఆగిపోతుంటాయి. ఎందుకు ఆగింది అనే విషయంలో బయటకు ఏవేవో విషయాలు చెప్పినా… బడ్జెట్‌ అనేది అసలు సమస్య అంటుంటారు. అంటే అనుకున్న బడ్జెట్ పెరిగిపోయినప్పుడు నిర్మాత ఆ డబ్బును రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి సమస్యను ‘దేవర’ టీమ్‌ ఎదుర్కొంటుందో? ఏమో సోషల్‌ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవర’. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ కాస్త ఆలస్యంగా మొదలైనా… అప్పటి నుండి వరుసగా సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు షూటింగ్‌లో కాస్త హాల్ట్‌ వచ్చింది అంటున్నారు. వివిధ కారణాల వల్ల సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది అని చెబుతున్నా… ముఖ్యంగా బడ్జెటే సమస్య అని చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్యను అధిగమించి షూటింగ్‌ ప్రారంభిస్తారు అని అంటున్నారు.

అయితే అంతా ఓకే అనుకుని ముందుకు దిగాక ఈ బడ్జెట్‌ సమస్య ఎందుకు అనే ప్రశ్న రావొచ్చు. దీనికి కారణం సినిమా రెండు ముక్కలు అవ్వడమే అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొస్తామని ఇప్పటికే చెప్పిన టీం… ఆ దిశగా కథను, సినిమాను విస్తరించే పనిలో ఉంది. దీని కోసం, ఆ చిత్రీకరణ కోసం అదనపు కాల్‌షీట్లు అవసరం పడతాయి. అవన్నీ డబ్బులతో కూడుకున్నవే. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ పెరిగింది అంటున్నారు.

పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు అయితే ఇలాంటి పరిస్థితిని సులభంగా దాటేస్తాయి. అదే కొత్తగా నిర్మాణంలోకి వచ్చిన నిర్మాణ సంస్థలు, చిన్న నిర్మాతలు ఇబ్బందిపడతారు. మరి ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యాకప్‌తో ఉన్న ఈ సినిమాను యువసుధ క్రియేషన్స్‌ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో చూడాలి. అయితే ఇదంతా సమస్య ఉన్నప్పుడు మాత్రమే అని మరచిపోవద్దు. అన్నట్లు గతంలోనూ కొరటాల సినిమాలకు (Devara) ఇలాంటి సమస్యలు వచ్చాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus