మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాకు మించిన పాన్ వరల్డ్ మూవీ అని స్వయంగా దర్శకుడు చెప్పుకోవడం విశేషం. తన స్టేట్మెంట్స్ తో అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్, హీరోయిన్ గా దీపికాను పదుకొనె ని ప్రకటించి మరింత హైప్ క్రియేట్ చేశాడు. దీనితో నిజంగా ప్రేక్షకుల ఊహకు మించిన స్కేల్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇక ఈ మూవీ బడ్జెట్ 500 కోట్లకు పైమాటే అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2022లో విడుదల చేయలనేది నిర్మాతల ఆలోచన. కాగా ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ మూవీ బుడ్జెట్ విషయంలో పునరాలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా వైరస్ తరువాత పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. గతంలో మాదిరి జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడం లేదు. కరోనా భయం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వేళా, సాధారణ పరిస్థితులు ఏర్పడినా ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూడకపోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం.
దానికి తోడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులలోకి చొచ్చుకుపోయాయి. కాబట్టి కొద్దిరోజులు తరువాత హాయిగా ఇంట్లో మూవీ చూద్దాం, థియేటర్స్ వికీ వెళ్లి రిస్క్ చేయడం ఎందుకు అనే ఆలోచన కూడా రావచ్చు. కాబట్టి థియేటర్స్ ద్వారా భవిష్యత్తులో వందల కోట్ల వసూళ్లు సాధ్యం కాకపోవచ్చు. దీనితో ప్రభాస్ 21కి అంత బడ్జెట్ పెడితే తిరిగి రాబట్టుకోగలమా అనే మీమాంస నిర్మాతలలో మొదలైందట.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?