Allu Arjun: త్రివిక్రమ్ సంగతి ఓకే.. కానీ అట్లీతో పెద్ద సమస్యే!

‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి? అంటే అందరూ త్రివిక్రమ్ పేరే చెబుతూ వచ్చారు నిన్న మొన్నటి వరకు. అయితే నిన్న ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రెస్ మీట్లో నాగ వంశీ.. త్రివిక్రమ్ (Trivikram) – అల్లు అర్జున్ సినిమా పై స్పందించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో ఆ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు అని.. 2025 సెకండాఫ్ నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని.. చెప్పుకొచ్చారు.దీనికి ముందు అల్లు అర్జున్- అట్లీ (Atlee Kumar) కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్తుందన్న ప్రచారం కూడా జరిగింది.

Allu Arjun

కానీ దానికి అధికారిక ప్రకటన రాలేదు. సో అందరూ అది ఫేక్ అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. నిన్న నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలా చెప్పడంతో అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో డౌటే అనే ఒక ఆలోచనకు వచ్చారు. సో ఎక్కువ శాతం అల్లు అర్జున్- అట్లీ కాంబోలో సినిమా సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది.ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం లేదు.

ఎందుకంటే ఈ ప్రాజెక్టు కోసం అల్లు అర్జున్ రూ.150 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు. తప్పేమీ లేదు ‘పుష్ప 2’ ఆల్మోస్ట్ ‘బాహుబలి 2’ (Baahubali 2) ని క్రాస్ చేసే రేంజ్ కి వెళ్ళింది అంటే బన్నీ రేంజ్ పెరిగినట్టే..! నిర్మాతలు బన్నీకి ఎంతైనా ఇవ్వడానికి రెడీ. కాకపోతే దర్శకుడు అట్లీ కూడా రూ.100 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. అవును.. ‘జవాన్’ (Jawan) వెయ్యి కోట్లు కొట్టింది కాబట్టి.. అంత మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ అట్లీ డైరెక్ట్ చేసిన సినిమా వెయ్యి కోట్లు కొట్టినా.. దాని క్రెడిట్ అతనికే ఎందుకు దక్కుతుంది. ఈ కారణంతోనే తమిళంలో అట్లీతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు. అందుకే తెలుగు హీరో వెంట పడుతున్నాడు అట్లీ. కానీ తెలుగు నిర్మాతలు కూడా అట్లీకి రూ.100 కోట్లు పారితోషికం ఇచ్చేందుకు రెడీగా లేరు అని తెలుస్తుంది.

అశిష్ కోసం ఆ ముగ్గురు..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus