టాలీవుడ్‌లో వారసులు తెరంగేట్రం చేయడం కొత్తేమీ కాదు. కానీ, వారిని సరైన కథలతో నిలబెట్టడం మాత్రం నిర్మాతలకే పెద్ద పరీక్ష. ముఖ్యంగా అశిష్ రెడ్డికి (Ashish Reddy) తొలి సినిమా రౌడీ బాయ్స్ (Rowdy Boys) ఆశించినంత లాభాలు తీసుకురాలేదు. తర్వాత ప్రకటించిన ప్రాజెక్ట్స్ సెల్ఫిష్ ఓ హారర్ లవ్ మీ (Love Me) పెద్దగా ఆడలేదు. గత ఏడాదికే షూటింగ్ పూర్తయిన సెల్ఫిష్ (Selfish) ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఇలాంటి సమయంలో అశిష్ కెరీర్‌ను ట్రాక్‌లో పెట్టేందుకు దిల్ రాజు (Dil Raju) మళ్లీ ప్లానింగ్ మొదలుపెట్టాడట.
తాజా సమాచారం ప్రకారం, ముగ్గురు డైరెక్టర్స్‌తో ఆయన చర్చలు జరుపుతున్నారట. మజాకా (Mazaka) విజయంతో ట్రాక్‌లోకి వచ్చిన త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina ) , బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar), క్లాసిక్ హిట్ మేకర్ కరుణాకరన్ (A. Karunakaran) , ఈ ముగ్గురిని అశిష్ సినిమాల కోసం లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. త్రినాథరావు నక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాల పరంగా మంచి ట్రాక్ రికార్డ్ కలిగిన దర్శకుడు. గతంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి.
మరోవైపు భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు వంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చిన ఈ దర్శకుడు, ప్రస్తుతం కాస్త గ్యాప్‌లో ఉన్నా, దిల్ రాజు బ్యానర్‌పై మరోసారి కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తొలి ప్రేమ (Tholi Prema) , ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి రొమాంటిక్ క్లాసిక్‌లను తెరకెక్కించిన కరుణాకరన్‌ను కూడా లైన్‌లో పెట్టారని టాక్.
దిల్ రాజు తన ఫ్యామిలీ హీరోను ఇండస్ట్రీలో నిలబెట్టాలంటే, సరైన కథలు, డైరెక్టర్ల ఎంపిక తప్పనిసరి. సెల్ఫిష్ సినిమా ఎందుకు ఆలస్యం అవుతోందన్నది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కానీ అశిష్ కోసం ఈ మూడు ప్రాజెక్ట్స్‌లో కనీసం ఒకటి ఫైనల్ అయితే, అతని కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందని చెప్పొచ్చు. మరి దిల్ రాజు అండ్ టీమ్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వేచి చూడాలి.