ఇంతకముందు సినిమాలు యాభై రోజుల ఫంక్షన్, వంద రోజుల ఫంక్షన్ లు జరుపుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఒక సినిమాకి మంచి టాక్ వచ్చినా.. కూడా వారం, రెండు వారాలకు మించి ఆడడం లేదు. చాలా వరకు వారం రోజుల్లో సినిమాలు థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. కొత్త సినిమాలు ఎంత రాబట్టుకున్నా.. అది మొదటివారంలోనే జరగలేదు. ఆ తరువాత థియేటర్లో సినిమా నిలవడం చాలా కష్టం. ప్రతి శుక్రవారం కొత్తగా రెండు మూడు సినిమాలు వస్తుంటాయి కాబట్టి ప్రేక్షకుల దృష్టి వాటి మీదకు వెళ్లిపోతుంటుంది.
ముందు వారం వచ్చిన సినిమాలను పెద్దగా పట్టించుకోరు. సరైన సినిమాలు లేనప్పుడు మాత్రమే గతవారపు సినిమాలకు క్రేజ్ ఉంటుంది. ఈ మధ్య అలా ప్రయోజనం పొందిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఇప్పుడు దసరా సినిమాలకు ఆ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. పండగకి ‘మహాసముద్రం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్లి సందడి’ సినిమా విడుదలయ్యాయి. వాటిలో ‘మహాసముద్రం’ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అలానే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘పెళ్లి సందడి’ సినిమాలు అంచనాలను మించి వసూళ్లు రాబట్టుకున్నాయి.
ఇప్పటికే ఈ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేశాయి. ఈ వారం ‘నాట్యం’, ‘అసలేం జరిగింది’, ‘మధుర వైన్స్’, ‘క్లిక్’ ఇలా బజ్ లేని సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ‘నాట్యం’ సినిమాను ఎంతగా ప్రమోట్ చేసినా.. అంత బజ్ రావడం లేదు. ఈ క్రమంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్లి సందడి’ సినిమాలు మరింత జోరు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!