పవర్ ఫ్యాన్స్ కు కూల్ ఆఫర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని శ్రీదేవి జానకి మినీ ధియేటర్ లో విడుదల చేస్తున్నారు. 2800 థియేటర్లలో విడుదలవుతుండగా.. ప్రత్యేకించి ఆ థియేటర్ గురించి ఎందుకు ప్రస్తావన అనుకొంటున్నారా?

అక్కడ ప్రత్యేకత ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి సొంత ఊరు అయిన మొగల్తూరు లో చిరు చేతుల మీదుగా ఈ ధియేటర్ ను ప్రారంభించారు. ఇప్పుడు సర్దార్ చిత్రం విడుదల అవుతుండటంతో.. ఈ చిత్రం విడుదల రోజున అన్నీ షోలకు కూల్ డ్రింక్స్ ను ఉచితంగా ఇస్తామని చెప్పడమే కాకుండా ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్యానర్లు కట్టడం విశేషం.

ఎండలు మండిపోతున్న ఈ తరుణంలో థియేటర్ యాజమాన్యం ఈ విధమైన ప్రకటన చేయడంతో.. పవర్ స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు.. టికెట్ల కోసం బారులు తీరుతున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus