Megastar : చిరంజీవి తో పోటీకి సై అంటున్న బన్నీ..!

Megastar : సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్‌కు పండుగ వాతావరణం. ఈసారి కూడా థియేటర్లు కళకళలాడేలా భారీ సినిమాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్‌లో కీలకంగా మారనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురంలో..’ మళ్లీ అదే జనవరి 12న రీ రిలీజ్ అవుతుందన్న ప్రచారం తెగ వైరల్ అవుతోంది. 2020లో ఇదే తేదీన విడుదలై రికార్డులు సృష్టించిన ఈ సినిమాను తిరిగి సంక్రాంతికి తీసుకురావాలన్న ఆలోచన ఉందన్న టాక్ చర్చకు దారి తీసింది.

దీంతో మెగా అభిమానుల మధ్య అసంతృప్తి కనిపిస్తోంది. కొత్త సినిమాలకు థియేటర్లు సరిపోని పరిస్థితిలో పాత హిట్‌ను రీ రిలీజ్ చేయడం అవసరమా? ఇది ఉద్దేశపూర్వక నిర్ణయమా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఇది కేవలం ప్రచారమేనా లేక నిజంగానే రీ రిలీజ్ ప్లాన్ ఉందా అన్నది అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత రానుంది. మొత్తానికి సంక్రాంతి బరిలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, ఈ రీ రిలీజ్ వార్త టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచింది. నిజం ఏంటన్నది వేచి చూడాల్సిందే, కానీ ఈ చర్చ మాత్రం పండుగ ముందు హీట్ పెంచిందన్నది మాత్రం వాస్తవం.

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్’ రన్ టైం ఎంతంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus