బన్నీ కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తారా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి1 కేవలం 650 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లకు పరిమితమైతే బాహుబలి2 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ బాహుబలి1 లో జక్కన్న ఇచ్చిన ట్విస్ట్ బాహుబలి2 సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు హిందీలో కనీవిని ఎరుగని స్థాయిలో కలెక్షన్లు రావడానికి కారణమైంది.

రాజమౌళి దేశంలోనే నంబర్ 1 డైరెక్టర్ అని చాలామంది భావించడానికి బాహుబలి1, బాహుబలి2 కారణమయ్యాయని చెప్పవచ్చు. బాహుబలి1 కు ప్రేక్షకుల్లో వచ్చిన గుర్తింపు వల్లే బాహుబలి2 ఆ స్థాయి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. కేజీఎఫ్ ఛాప్టర్1 సక్సెస్ సాధించినా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కేజీఎఫ్ ఛాప్టర్2 మాత్రం ఇప్పటికే 1097 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

మరో వారం లేదా రెండు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్2 ప్రభంజనం కొనసాగే అవకాశం ఉంది. బాహుబలి1, కేజీఎఫ్1 సినిమాల క్రేజ్ సీక్వెల్ సినిమాల విషయంలో ఉపయోగపడింది. ఈ సినిమాల విషయంలో ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ అంచనాలను మించి కలెక్షన్లు సాధించడం జరిగింది. పుష్ప ది రూల్ కూడా ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని బన్నీ అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

పుష్ప ది రైజ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన నేపథ్యంలో పుష్ప ది రూల్ కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని చెప్పవచ్చు. పుష్ప2 సినిమా కోసం బన్నీ 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే పుష్ప2 సినిమాకు సంబంధించి లొకేషన్స్ ఫైనలైజ్ చేశారని త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. పుష్ప2 సినిమాలో రెండు లేదా మూడు కొత్త పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. పుష్ప2 సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus