ఆన్‌లైన్‌ టికెటింగ్‌ బన్ని వాస్‌ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌ సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పోర్టల్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పరిశ్రమలోనూ, ప్రజల్లోనూ కాస్త స్పష్టత లేదు. ఎందుకు తీసుకొస్తున్నారు, అవసరమేంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలువురు సినిమా పెద్దలు వివరించినా… ఎక్కడో చిన్న అనుమానం. అసలు సినిమా పరిశ్రమ ఎందుకు… ఏపీ ప్రభుత్వాన్ని ‘ఆన్‌లైన్‌ టికెటింగ్‌’ పెట్టమని అడిగింది అనే అనుమానం ఉంటుంది. దీనిపై నిర్మాత బన్ని వాస్‌ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ ప్రస్తుతం అన్ని థియేటర్లలో ఉంది. దాని కోసం కొన్ని ప్రైవేటు సంస్థలు ఈ సర్వీసులను అందిస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం… రోజులో ఎన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయి, ఎంత ఆదాయం వస్తుంంది అనేది తమకు స్పష్టంగా తెలియాలని కోరింది. ఎందుకంటే కొంతమంది ఎగ్జిబ్యూటర్లు రాష్ట్రానికి సరిగ్గా పన్నులు చెల్లించడం లేదు. దీనికి తోడు రాష్ట్రంలో మూడోందలకుపైగా థియేటర్లు జీఎస్టీ పరిధిలో లేరు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఏపీ ప్రభుత్వం ఏం చేసినా చిత్ర పరిశ్రమ సలహాలు, సూచనల ప్రకారమే చేస్తోంది. ఇప్పుడు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని కూడా అలానే సిద్ధం చేస్తోంది అని బన్ని వాసు చెప్పారు. దీంతోపాటు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ తీసుకొస్తే… సినిమా ఆదాయమంతా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతుందనేది ఒక అపోహ అని కూడా బన్ని వాస్‌ చెప్పారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus