Suhas: ‘తండేల్’ ఆ రోల్ సుహాస్ చేయాలి.. కానీ నేనే వద్దన్నాను: బన్నీ వాస్

సుహాస్ ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అతని లేటెస్ట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ రిలీజ్ కి రెడీ గా ఉంది. ఫిబ్రవరి 2 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దుష్యంత్ కటికినేని.. ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. ‘జిఎ2 పిక్చర్స్’ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ వాస్ సమర్పకులు. ఈరోజు హైదరాబాద్ లోని ఆవాస స్టార్ హోటల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్ కి హీరో అడివి శేష్ గెస్ట్ గా విచ్చేసారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా మా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ జెన్యూన్ మూవీ అవుతుంది అనే నమ్మకం ఉంది. సుహాస్ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. అతన్ని చూస్తే 10 ఏళ్ళ క్రితం నన్ను, ఎస్.కె.ఎన్ ..లను చూసినట్టు ఉంటుంది. అతను చాలా మంచి నటుడు.

‘తండేల్’ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి పక్కనే ఉండే ఓ మంచి పాత్ర ఉంటుంది. అది సుహాస్ కే కరెక్ట్ గా సెట్ అవుతుంది. కళ్ళు మూస్తే ఆ పాత్రకి సుహాసే గుర్తొచ్చేవాడు. ఆ విషయం సుహాస్ తో చెప్పి.. ఆ పాత్ర చేయొద్దు అని కూడా నేనే చెప్పాను. హీరోగా చేస్తున్నాడు

కాబట్టి మళ్ళీ అలాంటి పాత్రలు చేస్తే అతని కెరీర్ ఎలా ఉంటుందో అనే డౌట్ తో వద్దన్నాను’ అంటూ బన్నీ వాస్ చెప్పుకొచ్చాడు. మరి సుహాస్ (Suhas) మిస్ అయిన ఆ పాత్ర ఎలా ఉండబోతుందో.. ఎవరు చేస్తున్నారో తెలియాలి అంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus