Bunny Vas, Banda Ganesh: బండ్ల గణేష్ మా మూడ్ అంతా స్పాయిల్ చేశాడు: బన్నీ వాస్

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అనే బ్రాండ్ తో ప్రమోట్ అయిన బండ్ల గణేష్ మైక్ అందుకుంటే అది కాంట్రోవర్సీ అవ్వాల్సిందే. ఆయన మాటలు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్. రీసెంట్‌గా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో ఆయన అల్లు అరవింద్ పై చేసిన కొన్ని పరోక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆ కామెంట్స్‌పై ప్రొడ్యూసర్ బన్నీ వాసు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో కొందరికే అదృష్టం ఉంటుందని, మెగాస్టార్ బావమరిదిలా, ఐకాన్ స్టార్ తండ్రిలా అందరూ పుట్టలేరు’ అంటూ మాట్లాడారు.

Bunny Vas, Banda Ganesh

అలాగే ‘అల్లు అరవింద్ ఎటువంటి కష్టం అనుభవించకుండా సక్సెస్ క్రెడిట్ కొట్టేస్తాడు అని.. అది ఆయన అదృష్టం బన్నీ వాస్ దురదృష్టం’ అంటూ అల్లు అరవింద్‌ను టార్గెట్ చేశాడు. అంతేకాదు ‘ఈ మాఫియా మనల్ని బతకనీయదు’ అంటూ మౌళిని అడ్డంపెట్టుకుని మరో ఘాటు కామెంట్ విసిరాడు. ఇది కూడా పెద్ద డిస్కషన్స్ కి దారితీసింది.

బండ్ల గణేష్ మాటలకు బన్నీ వాసు స్పందించి… “అల్లు అరవింద్ గారు స్టార్ కమెడియన్‌కు పుట్టారని కామెంట్ చేయడం సరైన పద్ధతి కాదు. అల్లు అరవింద్ గారు పుట్టాకే ఆయన తండ్రి అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారు. ఈ విషయం బండ్లన్నకు తెలిసి ఉండకపోవచ్చు” కౌంటర్ విసిరారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ కి మరోసారి బన్నీ వాస్ గురించి ప్రశ్న ఎదురైంది.

ఈ క్రమంలో బన్నీ వాస్ మాట్లాడుతూ.. “బండ్ల గణేష్ మాటలు నన్ను నిజంగా షాక్‌కు గురిచేశాయి. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన అల్లు అరవింద్ గారి గురించి అలా మాట్లాడటం నన్ను చాలా బాధించింది.ఓ మంచి సక్సెస్ మీట్ వాతావరణాన్ని ఆయన మాటలు పూర్తిగా పాడు చేశాయి” అంటూ చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆయనను సపోర్ట్ చేస్తే, మరికొందరు ఇలాంటి వేదికలపై వ్యక్తిగత విమర్శలు సరికాదని అభిప్రాయపడ్డారు.

 విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus