కొన్ని సినిమాల ఫస్ట్ కాపీలు రెడీ అయినప్పటికీ కరోనా కారణంగా పక్కన పెట్టేశారు. ఓటీటీల నుండి ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేశారు. వడ్డీల భారం తట్టుకొని సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలని ఎదురుచూశారు. ఫైనల్ గా థియేటర్లు తెరుచుకున్నాయి. కానీ ఇప్పుడు థియేటర్లో సినిమాను రిలీజ్ చేసే ధైర్యం నిర్మాతలు చేయలేకపోతున్నారు. దానికి కారణం 50% ఆక్యుపెన్సీ, పైగా చాలా షరతుల మధ్య సినిమాను రిలీజ్ చేయాలి. దీని కారణంగా రెవెన్యూ తగ్గించుకోవాల్సి వస్తుంది. దీంతో నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమా చూసే ఉత్సాహం చూపించడం లేదు. ఈ మధ్యే థియేటర్లు తెరుచుకున్నా. చాలా వరకు ఖాళీగానే కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు రిలీజైతే తప్ప ప్రేక్షకులకు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలనే ఆసక్తి రాదేమో. కానీ అలా ధైర్యం చేసి సినిమాలను రిలీజ్ చేసేదెవరనేది ప్రశ్న. ఏ నిర్మాతలు చేయని ధైర్యం ఇప్పుడు సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ చేస్తున్నారు. తన ప్రొడక్షన్ లో తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
దీని గురించి ప్రకటన వచ్చినప్పటికీ.. జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రకటనకు కట్టుబడి సినిమాను రిలీజ్ చేస్తారని అనుకోలేదు. కానీ చిత్రబృందం 25న థియేట్రికల్ రిలీజ్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రేక్షకులు వస్తారా..? లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి పేరున్న సినిమా రిలీజైతే.. సినిమా రిజల్ట్ ని బట్టి మిగిలిన నిర్మాతలు కూడా ముందడుగు వేస్తారేమో చూడాలి!
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!