కొన్ని రోజులుగా ఇండస్ట్రీ పెద్ద ఎవరనే విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో లేవనెత్తిన ఈ అంశంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని చాలా మంది కోరుకున్నారు. కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు చిరు. ఇండస్ట్రీ పెద్ద స్థానంలో ఉండలేనని అన్నారు. ఎవరికైనా కష్టమొస్తే వారికి సాయం చేయడానికి ముందుకొస్తాను కానీ ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి మాత్రం ముందుకు రానని చెప్పారు చిరు.
అనంతరం మోహన్ బాబు రాసిన బహిరంగ లేఖ హాట్ టాపిక్ గా మారింది. అప్పటినుంచి సినీ పరిశ్రమకు పెద్ద ఎవరనే దానిపై సినీ ప్రముఖులు ఎవరి అభిప్రాయాన్ని వారు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమమంలో మోహన్ బాబు సినిమా పరిశ్రమకు రాసిన లేఖలో ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కాదని అన్నారు. టికెట్ రేట్ ఇష్యూపై కూడా ఆయన స్పందించారు. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ సమస్యను భుజాలపై వేసుకోకుండా ఎవరికి తోచినట్లు వారు చేస్తున్నారని మండిపడ్డారు మోహన్ బాబు.
నిర్మాతల్లో ఐక్యత లేదని అన్నారు. ఇప్పుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ స్పందించారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉందని అన్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తం సినిమా రంగంలోనే ఉందని.. ఆయన ముందుండి సమస్యను పరిష్కరిస్తామంటే ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిర్మాతల్లో ఐక్యత లేకపోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మోహన్ బాబు అంటున్నారని.. అయితే మోహన్ బాబు కూడా ఓ నిర్మాతే అని గుర్తు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!