నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మొదటి వారమే దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించింది. దీంతో బాలయ్య- బోయపాటి ల కాంబోలో హ్యాట్రిక్ కంప్లీట్ అయ్యింది. అఘోరగా బాలయ్య నటన.. బోయపాటి ఎలివేషన్స్.. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలగలిపి ‘అఖండ’ ను సూపర్ హిట్ గా నిలబెట్టాయి. అంతా బానే ఉంది కానీ ‘అఖండ’ ఇంకా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది.
ఇప్పటివరకు ఓవర్సీస్, నైజాం, నెల్లూరు,సీడెడ్ వంటి ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. కానీ ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు వంటి ఏరియాల్లో ‘అఖండ’ బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఈ ఏరియాల్లో రూ.22.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఇప్పటివరకు రూ.16.45 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది ‘అఖండ’. అంటే మరో రూ.6.05 కోట్ల షేర్ ను ఈ ఏరియాల్లో రాబడితేనే అక్కడి బయ్యర్స్ సేఫ్ అవుతారు.
ఈ వీకెండ్ గట్టిగా రాబడితేనే తప్ప అక్కడి బయ్యర్లు నష్టాల నుండీ తప్పించుకోలేరు. పోటీగా ‘లక్ష్య’ ‘గమనం’ వంటి చిన్న సినిమాలు ఉన్నాయి. వచ్చేవారం ‘పుష్ప’ ఎంట్రీ ఇవ్వబోతుంది. టికెట్ రేట్లు తగ్గింపు అనేది దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ముందుముందు రాబోయే పెద్ద సినిమాలు సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకోకపోతే మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!