ఆ హీరోలను మించి తారక్ మెప్పిస్తారా..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో ఒక రియాలిటీ షోను జెమినీ టీవీలో హోస్ట్ చేయబోతున్నాడని గత కొంతకాలం నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో ప్రోమోను త్రివిక్రమ్ శ్రీనివాస్ షూట్ చేశాడని తెలుస్తోంది. ఏప్రిల్ లేదా మే నెల నుంచి జెమినీ ఛానల్ లో ఈ షో ప్రసారం కానుందని సమాచారం. గతంలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు స్వల్పంగా మార్పులు చేసి జెమినీ ఛానల్ నిర్వాహకులు ఎవరు మీలో కోటీశ్వరుడు షోను ప్రసారం చేస్తున్నారు.

స్టార్ మా ఛానెల్ లో ఈ షో ప్రసారమైన సమయంలో మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తే ఒక సీజన్ కు చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు. నాగార్జున హోస్ట్ చేసిన మూడు సీజన్లు సక్సెస్ కాగా చిరంజీవి హోస్ట్ చేసిన సీజన్ 4 మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత స్టార్ మా ఛానెల్ నిర్వాహకులు ఈ షోపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే జెమినీ ఛానల్ లో ఈ షోను సక్సెస్ చేయడం అంత ఈజీ కాదని ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం తెలుగులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో జెమిని ఛానల్ 4వ స్థానంలో ఉంది. ఈ ఛానల్ లో సినిమాలు మినహా మిగతా ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి ఈ షోను హోస్ట్ చేయడంతో ఎన్టీఆర్ హోస్టింగ్ ను ఆ ఇద్దరు హీరోలతో కచ్చితంగా పోలుస్తారు. ఎన్టీఆర్ చిరు, నాగార్జునను మించి తన హోస్టింగ్ తో మెప్పిస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ ఈ షోరో బిగ్ బాస్ షోను మించిన టీఆర్పీ రేటింగ్ లు సాధించాల్సి ఉంది. ఎన్టీఆర్ ముందు చాలా టార్గెట్ లు ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షోతో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus