కోన వెంకట్ మళ్ళీ కొట్టగలడా..??

సంవత్సరం క్రితం వరకు స్టార్ రైటర్ గా వెలుగొందిన కోన వెంకట్ ప్రభ ఒక్కసారిగా మసకబారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. వరసగా అయిదు సినిమాలు అపజయం పాలు కావడంతో.. రైటర్ గా కోన వెంకట క్రెడిబిలిటీ పూర్తిగా పడిపోయింది.

“ఢీ, రెడి, దూకుడు, గీతాంజలి, లౌక్యం” వంటి సినిమాలు ఘన విజయాలు సాధించడంతో కోన పేరు మారుమ్రోగిపోయింది. అయితె.. “త్రిపుర, బ్రూస్ లీ, శంకరాభరణం, అఖిల్, సౌఖ్యం” చిత్రాలు ఒక దాని వెనుక ఒకటి.. ఒక దానిని మించి మరొకటి ఫ్లాప్ కావడం కొనకు శాపంగా మారింది.

ఒకప్పుడు ఒక సినిమాకు కోన వెంకట్ రైటర్ గా ఉన్నాడంటే.. అది ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. అందుకు ఉదాహరణ నాగ చైతన్య నటిస్తున్న “సాహసమే శ్వాసగా సాగిపో”. నాగ చైతన్యకు “ఏ మాయ చేసావే” వంటి సూపర్ హిట్ ఇచ్చిన గౌతమ్ మీనన్ “సాహసమే సాగిపో” చిత్రానికి దర్సకుడయినప్పటికీ.. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి కోన వెంకట్ రైటర్ కావడంతోపాటు.. ఈ చిత్రాన్ని తెలుగులో ఆయన సమర్పిస్తుండడం వల్ల ఈ సినిమాకి బిజినెస్ పరంగా పెద్దగా క్రేజ్ ఏర్పడడం లేదు. అందుకే ఈ సినిమా సక్సెస్ కోసం కోన వెంకట్ చాలా కసిగా పని చేస్తున్నాడని.. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని కోన వెంకట్ సన్నిహితులు చెబుతున్నారు!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus